ఒక్క వార్డుకే టీజే‘ఎస్‌’

26 Jan, 2020 03:12 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలని ఏర్పాటైన తెలంగాణ జన సమితి (టీజేఎస్‌) మున్సిపల్‌ ఎన్నికల్లోనూ ప్రభావం చూపలేకపోయింది. ఇప్పటివరకు జరిగిన జిల్లా పరిషత్, అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపించని ఆ పార్టీ తాజాగా జరిగిన మున్సి‘పోల్స్‌’లోనూ పెద్దగా సీట్లు గెలుచుకోలేకపోయింది. తాండూరు మున్సిపాలిటీలో ఒకే ఒక్క వార్డును టీజేఎస్‌ గెలుచుకుంది. అక్కడి 34వ వార్డు నుంచి పోటీ చేసిన ఆ పార్టీ అభ్యర్థి సోమశేఖర్‌ గెలుపొందారు.  

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు