భారీ ఏర్పాట్లు

17 May, 2019 12:49 IST|Sakshi
పార్లమెంటు ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎం

నిజామాబాద్‌ పార్లమెంట్‌ స్థానానికి దేశంలో ఎక్కడా లేనివిధంగా అధిక సంఖ్యలో అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రతి పోలింగ్‌బూత్‌లో ఒక్కో అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయనేది అభ్యర్థులందరి పోలింగ్‌ ఏజెంట్లు ఖరారు చేయాల్సి ఉంటుంది. ఇలామొత్తం 1,788 పోలింగ్‌ కేంద్రాల్లో 185 మంది అభ్యర్థులకు వచ్చిన ఓట్లు లెక్కించాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రతి రౌండ్‌కు సమయం పడుతుంది. సాధారణంగా అన్ని ఎంపీ స్థానాలకు పోలింగ్‌ కేంద్రాల సంఖ్యను బట్టి 14 నుంచి 18 టేబుళ్లను ఏర్పాటు చేసి ఓట్లు లెక్కించనున్నారు. నిజామాబాద్‌లో రెట్టింపు ఏర్పాట్ల కోసం అధికారులు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి కోరారు.

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌ : అభ్యర్థుల సంఖ్య అధికంగా ఉన్న నిజామాబాద్‌ పార్లమెంట్‌ స్థానం ఓట్ల లెక్కింపునకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని జిల్లా అధికార యంత్రాంగం భావిస్తోంది. సాధారణంగా అన్ని ఎంపీ స్థానాలకు పోలింగ్‌ కేంద్రాల సంఖ్యను బట్టి 14 నుంచి 18 టేబుళ్లను ఏర్పాటు చేసి ఓట్లు లెక్కించనున్నారు. నిజామాబాద్‌ స్థానం విషయానికి వస్తే 185 మంది అభ్యర్థులు బరిలో ఉండటంతో 18 టేబుళ్ల ద్వారా లెక్కిస్తే ఫలితాలు వెల్లడించడానికి అధిక సమయం పడుతుంది. టేబుళ్ల సంఖ్యను పెంచడం ద్వారా వీలైనంత తొందరగా ఫలితాలను ప్రకటించవచ్చని అధికారులు భావిస్తున్నారు.

ఇందుకోసం 36 టేబుళ్లను ఏర్పాటు చేసుకునేందుకు అనుమతివ్వాలని జిల్లా కలెక్టర్‌ ఎం రామ్మోహన్‌ రావు కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపారు. ఒకటీ రెండు రోజుల్లో ఈ అంశంపై ఎన్నికల సంఘం నుంచి నిర్ణయం వెలువడే అవకాశాలున్నాయని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతానికి 18 టేబుళ్ల ద్వారానే కౌంటింగ్‌ జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, ఈసీఐ అనుమతిస్తే టేబుళ్ల సంఖ్యను పెంచేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. ని జామాబాద్‌ పార్లమెంట్‌ స్థానం పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఈ స్థానానికి దేశంలో ఎక్కడా లేనివిధం గా 185మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

ప్రతి పోలింగ్‌బూత్‌లో ఒక్కో అభ్యర్థి కి ఎన్ని ఓట్లు వచ్చాయనేది అభ్యర్థులం దరి పోలింగ్‌ ఏజెంట్లు ఖరారు చేయాల్సి ఉంటుంది. ఈవీఎంలోని కంట్రోల్‌ యూ నిట్‌లో వచ్చే డిస్‌ప్లేను అందరు ఏజెంట్లు చూసుకోవాల్సి ఉంటుంది. ఇలామొత్తం 1,788 పోలింగ్‌ కేంద్రాల్లో 185 మంది అభ్యర్థులకు వచ్చిన ఓట్లు లెక్కించాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రతి రౌండ్‌కు సమయం పడుతుంది.

దీంతో నిజామాబాద్‌ పార్లమెంట్‌ స్థానం ఫలితం రావడం ఆలస్యమవుతుంది. జగిత్యాల, కోరుట్ల అసెంబ్లీ స్థానాల పరిధిలోని ఓట్ల లెక్కింపు జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించనున్నారు. జిల్లా పరిధిలోని ఐదు అసెంబ్లీ స్థా నాల పరిధిలోని ఓట్ల లెక్కింపు డిచ్‌పల్లి లోని సీఎంసీలో ఏర్పాటు చేశారు. మొత్తం 15.53 లక్షల మంది ఓటర్లు ఉండగా, 10.61 లక్షల మంది ఓటర్లు తమ  ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

మరిన్ని వార్తలు