కౌంటింగ్‌కు పటిష్ట భద్రత

20 May, 2019 11:15 IST|Sakshi

సాక్షిప్రతినిధి, నిజామాబాద్‌: నిజామాబాద్‌ లోక్‌సభ ఓట్ల లెక్కిం పు ప్రక్రియ సందర్భంగా ప టిష్ట భద్రత ఏర్పాటు చే యనున్నట్లు పోలీస్‌ క మిషనర్‌ కార్తికేయ తె లిపారు. కౌంటింగ్‌ నిర్వ హించే డిచ్‌పల్లిలోని క్రిస్టియన్‌ మెడికల్‌ క ళాశాల (సీఎంసీ) పరిసరాల్లో 144 సెక్షన్‌ అమ లులో ఉంటుందని చెప్పారు. సీపీ ఆదివారం తన చాంబర్‌లో విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 23న జరగనున్న నిజామాబాద్‌ ఎంపీ స్థానం ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద గట్టి బందోబస్తును ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. లెక్కింపు కేంద్రం వద్దకు అభ్యర్థులు, కౌంటింగ్‌ ఏజెంట్లు, కౌంటింగ్‌ విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బంది తప్ప ఇతరులను అనుమతించబోమని స్పష్టం చేశారు.

ఓట్ల లెక్కింపు కేంద్రానికి వెళ్లే అన్ని దారుల్లో చెక్‌ పోస్టులు ఏర్పాటు చేస్తామని, అనుమతి ఉన్న వారిని మాత్రమే కౌంటింగ్‌ కేంద్రం వద్దకు పంపుతామన్నారు. వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు కౌంటింగ్‌ కేంద్రం వద్దకు రావద్దని సూచించారు. ఎలాంటి ర్యాలీలు నిర్వహించేందుకు అనుమతి లేదని స్పష్టం చేశారు. పోలీసుశాఖలోని టాస్క్‌ఫోర్స్‌ విభాగం 2018లో గేమింగ్, గుట్కా, ఎక్సైజ్, ఎక్స్‌ప్లోసివ్, మైనింగ్‌ తదితర చట్టాల కింద 493 కేసులు నమోదు చేసిందని వివరించారు. 2019లో ఇప్పటి వరకు 14 కేసులు నమోదయ్యాయని తెలిపారు.

మరిన్ని వార్తలు