ఉద్యమ కేసులు.. కీలక సమీక్ష!

4 May, 2018 19:54 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ ఉద్యమ కేసుల విషయమై రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, మంత్రులు కేటీఆర్‌, జగదీశ్‌ రెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పలువురు ఉద్యమకారులపై పోలీసులు కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కేసులను ఎత్తివేసేందుకు తెలంగాణ ప్రభుత్వం గతంలో జీవో జారీ చేసిందని మంత్రులు తెలిపారు. ఎక్కడైనా కేసులు పెండింగ్‌లో ఉంటే.. 15 రోజుల్లో వివరాలను ప్రభుత్వానికి అందించాలని కోరారు. ఉద్యమకాలంలో నమోదైన మిగతా కేసుల ఎత్తివేతపై న్యాయనిపుణులతో చర్చిస్తామని మంత్రులు నాయిని, జగదీశ్‌రెడ్డి, కేటీఆర్‌ తెలిపారు.

ఉద్యమకాలంలో నమోదైన కొన్ని కేసులు సాంకేతిక కారణాలు చూపుతూ.. న్యాయస్థానాలు ఎత్తివేసేందుకు నిరాకరించాయి. పలు కేసులు పెండింగ్‌లో ఉండటంతో అవి ఎదుర్కొంటున్న ఉద్యమకారులకు న్యాయపరమైన చిక్కులు తప్పడం లేదు. ఇటీవల ఓ ఉద్యమకారుడికి  తెలంగాణ ఉద్యమకాలం నాటి కేసులో న్యాయస్థానం ఆరు నెలల జైలు శిక్ష విధించడంతో.. ఈ విషయంలో రాష్ట్ర  ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

మరిన్ని వార్తలు