మున్సిపల్‌ ఎన్నికలు : కౌంటింగ్‌ అప్‌డేట్స్‌

25 Jan, 2020 08:00 IST|Sakshi

కొనసాగుతున్న కౌంటింగ్‌

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన మున్సిపల్‌, కార్పొరేషన్‌ ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ పూర్తయింది. మొత్తం 120 మున్సిపాలిటీలకు గాను 109 స్థానాలను సొంతం చేసుకున్న టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రత్యర్థులకు అందనంత ఎత్తులో నిలిచింది. 9 కార్పొరేషన్లకు గాను టీఆర్‌ఎస్‌ 8 చోట్ల విజయం సాధించింది. ఇక కాంగ్రెస్‌ కథలో మార్పేమీ లేదు. ఆ పార్టీ కేవలం 4 మున్సిపాలిటీలను మాత్రమే కైవసం చేసుకుంది. బీజేపీ 3 మున్సిపాలిటీల్లో విజయం సాధించింది. ఈనెల 22న రాష్ట్రవ్యాప్తంగా 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.

కౌంటింగ్‌ ప్రక్రియ ఈరోజు (శనివారం) ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2619 కౌంటింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఓట్ల సంఖ్యను బట్టి 5 నుంచి 24 రౌండ్లపాటు కౌంటింగ్‌ ప్రక్రియ జరిపారు. మొదటగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను లెక్కించిన అనంతరం బ్యాలెట్‌ పత్రాల ఓట్ల కౌటింగ్‌ను మొదలు పెట్టారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఒకవేళ ఓట్లు సమానంగా వస్తే లాటరీ ద్వారా అభ్యర్థి విజయాన్ని నిర్ణయించారు. కాగా, ఈ నెల 27న మేయర్లు, ఛైర్‌పర్సన్ల ఎన్నిక జరగనుంది. అదే రోజు కొత్త పాలక మండళ్ల తొలి సమావేశం జరనుంది. తొలి సమావేశంలోనే మేయర్లు, మున్సిపల్‌ ఛైర్మన్ల ఎన్నిక ప్రక్రియ నిర్వహించనున్నారు. సభ్యుల ప్రమాణం అనంతరం మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు మేయర్లు, ఛైర్మన్ల ఎన్నిక జరగనుంది. ఆ వెంటనే డిప్యూటీ మేయర్లు, వైస్‌ ఛైర్మన్ల ఎంపిక జరగనుంది. ఇప్పటికే మేయర్లు, ఛైర్‌పర్సన్ల ఎంపిక కోసం నోటిఫికేషన్‌ జారీ అయింది.

పార్టీలు  మున్సిపాలిటీలు కార్పొరేషన్‌లు
టీఆర్‌ఎస్‌ 109 08
కాంగ్రెస్‌ 04 0
బీజేపీ 03 1
ఇతరులు 03 0

కౌంటింగ్‌ అప్‌డేట్స్‌ :

క్యాంప్‌లకు తరలింపు
నల్గొండలో మున్సిపాలిటీలో ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం రాకపోవడంతో చైర్మన్‌ పదవిని దక్కించుకునేందుకు కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ సన్నాహాలు మొదలుపెట్టాయి. గెలిచిన అభ్యర్థులను క్యాంపులకు తరలిస్తున్నాయి. 20 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు ప్రత్యేక బస్సులో కుటుంబ సభ్యులతో కలిసి క్యాంపులకు బయలు దేరారు.

నల్గొండలో హంగ్‌
నల్గొండ మున్సిపాలిటీలో ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం రాలేదు. 48 వార్డులకు గానూ  కాంగ్రెస్‌ 20, టీఆర్‌ఎస్‌ 20, బీజేపీ 6, ఎంఐఎం, ఇండిపెండెంట్‌ ఒక్కో స్థానంలో గెలిచారు. ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం రాకపోవడంతో బీజేపీ మద్దతు కీలకం కానుంది.

తుర్కయంజాల్ మున్సిపాలిటీని కాంగ్రెస్‌ పార్టీ సొంతం చేసుకుంది. మొత్తం 24 స్థానాలకు గాను ఆ పార్టీ అభ్యర్థులు 17 చోట్ల విజయం సాధించారు. టీఆర్‌ఎస్‌ 5, బీజేపీ 1, స్వతంత్రులు 1 చోట గెలుపొందారు. స్పష్టమైన మెజారిటీ సాధించిన కాంగ్రెస్‌ చైర్మన్‌ స్థానాన్ని కైవసం చేసుకుంది.

ఎమ్మెల్యేను నెట్టేసిన టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు..
సాక్షి, యాదాద్రి భువనగిరి : యాదగిరిగుట్ట మున్సిపాలిటీ కౌంటింగ్‌ కేంద్రం వద్దకు చేరుకున్న కోమటిరెడ్డి బ్రదర్స్‌ పట్ల టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు అనుచితంగా ప్రవర్తించారు. ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత తన పట్ల దురుసుగా ప్రవర్తించారని, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు నెట్టేశారని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆరోపించారు. యాదగిరిగుట్టలో కాంగ్రెస్‌కు మెజారిటీ స్థానాలు వచ్చాయని, ఆ అక్కసుతోనే టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు మితిమీరి ప్రవర్తిస్తున్నారని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • యాదాద్రి: రాష్ట్రమంతా మున్సిపల్‌ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూస్తున్న కాంగ్రెస్‌ పార్టీకి యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో ఊరట లభించింది. యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో కాంగ్రెస్‌ ఆధిక్యం ప్రదర్శించింది. ఇక్కడ కాంగ్రెస్ ఐదు, టీఆర్‌ఎస్‌ మూడు, సీపీఐ 1 ఒకటి, ఇండిపెండెంట్లు మూడు వార్డుల్లో విజయం సాధించారు. సీపీఐ, స్వతంత్ర అభ్యర్థుల మద్దతు కాంగ్రెస్‌కు ఉండటంతో ఇక్కడ ఆ పార్టీ మున్సిపల్ చైర్మన్‌ పదవిని సొంతం చేసుకొనే అవకాశముంది.
  • నిజామాబాద్‌లో టీఆర్ఎస్ తాజా మాజీ మేయర్ ఆకుల సుజాత ఓటమి.. నిజామాబాద్‌ ఆరో డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఆకుల సుజాతపై 1509 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి ఉమారాణి ఘనవిజయం.

    మున్సిపాలిటీల వారీగా:
    నల్లగొండ మున్సిపాలిటీ: 48
    కాంగ్రెస్- 20
    టీఆర్‌ఎస్‌- 20
    బీజేపీ- 06
    ఎంఐఎం- 1
    ఇండిపెండెంట్‌: 1

  • తుక్కుగూడ మున్సిపాలిటీ: మొత్తం 15 సీట్లు
    బీజేపీ- 9
    టీఆర్‌ఎస్‌- 5
    స్వతంత్రులు : 1

    బడంగ్‌పేట్ మున్సిపాలిటీ: 22
    టీఆర్‌ఎస్‌- 15
    బీజేపీ- 3
    కాంగ్రెస్‌ -3
    స్వతంత్రులు : 1

    జల్లపల్లి మున్సిపాలిటీ:
    టీఆర్‌ఎస్‌ - 5
    ఎంఐఎం - 6
    బీజేపీ - 2

    తాండూరు (34) :
    టీఆర్ఎస్ 12
    బీజేపీ 5
    కాంగ్రెస్ 4
    ఇండిపెండెంట్ 2
    టీజేఎస్‌ 1

    పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ (26)
    టీఆర్ఎస్ - 16
    కాంగ్రెస్ - 3
    బీజేపీ - 1
    స్వతంత్రులు - 6

  • సూర్యాపేట జిల్లా : టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇలాకా అయిన హుజూర్‌నగర్ మున్సిపాలిటీని టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. ఈ మున్పిపాలిటీలో మొత్తం 28 సీట్లు ఉండగా 18 వార్డుల్లో కారు విజయం సాధించింది. మరో మూడు వార్డులు లెక్కింపు మిగిలి ఉండగానే టీఆర్‌ఎస్‌ ఇక్కడ విజయం సాధించింది. ఎంపీగా గెలుపొందిన ఉత్తమ్‌ రాజీనామా చేయడంతో హుజూర్‌నగర్‌ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరగగా.. ఇక్కడ ఉత్తమ్‌ సతీమణి పద్మావతిపై టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి సైదిరెడ్డి గెలుపొందారు.

    నిజామాబాద్‌లో తిరుగులేని కారు..!

  • ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ క్లీన్‌స్వీప్‌ చేసింది. మొత్తం ఆరు మున్సిపాలిటీలకుగాను ఆరు మున్సిపాలిటీల్లో కారు దూసుకుపోయింది. భీంగల్‌ మున్సిపాలిటీలో 12 వార్డులకు 12 వార్డులు సాధించి క్లీన్‌స్వీప్‌ చేసిన గులాబీ పార్టీ.. ఆర్మూర్, కామారెడ్డి, బోధన్, ఎల్లారెడ్డి, బాన్సువాడల్లో పూర్తి మెజారిటీని సాధించింది.
     
  • రామగుండం కార్పొరేషన్‌లో హంగ్‌ ఫలితాలు వచ్చాయి. ఇక్కడ ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాలేదు. ఈ కార్పొరేషన్‌లో మొత్తం 50 డివిజన్లు ఉండగా.. అందులో టీఆర్‌ఎస్‌ 19, కాంగ్రెస్‌ ఆరు, బీజేపీ ఐదు, ఇతరులు తొమ్మిది స్థానాలు గెలుపొందారు. టీఆర్‌ఎస్‌ అత్యధిక స్థానాలు గెలుపొందినప్పటికీ.. కార్పొరేషన్‌ పీఠాన్ని కైవసం చేసుకోవాడానికి కావాల్సిన మెజారిటీ సాధించలేదు. దీంతో ఇతర, స్వతంత్ర అభ్యర్థులు చైర్‌పర్సన్‌ ఎన్నికలో కీలకం కానున్నారు.
     
  • మంచిర్యాల: లక్సెట్టిపేట మున్సిపాలిటీ మూడో వార్డులో ఇద్దరు అభ్యర్థులకు సమాన ఓట్లు. టాస్‌ ద్వారా తుదిఫలితం ఖరారు చేసిన పోలింగ్‌ అధికారులు. టాస్‌ ద్వారా కాంగ్రెస్‌ అభ్యర్థిపై టీఆర్‌ఎస్‌ అభ్యర్థి విజయం
     
  • మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు విజయం అందించిన ప్రజలకు కృతజ్ఞతలు. బంగారు తెలంగాణ కేసీఆర్‌కే సాధ్యమని ప్రజలు నమ్మారు- ట్విటర్‌లో మంత్రి కేటీఆర్‌
     
  • ఎన్నికలేవైనా గెలుపుమాత్రం టీఆర్‌ఎస్‌దేనని మరోసారి రుజువైంది. మున్సిపల్‌ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ ప్రభంజనం వీసింది. ఇందుకుగాను సీఎం కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు అభినందనలు. బంగారు తెలంగాణ కేసీఆర్‌కే సాధ్యమని చాటిన ప్రజానికానికి కృతజ్ఞతలు- ట్విటర్‌లో మంత్రి హరీష్‌రావు
     
  • ఉమ్మడి మెదక్‌ జిల్లాలోనూ గులాబీ పార్టీ అంచనాలను అందుకుంటూ ఫలితాలను సాధించింది. ఇక్కడ మొత్తం 15 మున్సిపాలిటీలు ఉండగా 14 మున్సిపాలిటీలను కారు కైవసం చేసుకుంది. ఒక్క నారాయణఖేడ్‌ మున్సిపాలిటీలో కాంగ్రెస్‌ విజయం సాధించగలిగింది.
     
  • నిర్మల్‌: అత్యంత ఉత్కంఠ రేపిన నిర్మల్‌ జిల్లా  భైంసా మున్సిపాలిటీని ఎంఐఎం పార్టీ సొంతం చేసుకుంది.
  • హైదరాబాద్‌: మధ్యాహ్నం 3 గంటలకు సీఎం కేసీఆర్‌ ప్రెస్‌మీట్‌.. మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఘనవిజయం సాధించిన నేపథ్యంలో విలేకరులతో మాట్లాడనున్న ముఖ్యమంత్రి

  • మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ దూకుడు కొనసాగుతోంది. తిరుగులేని జోరుతో దూసుకుపోతున్న కారు.. ఇప్పటికే మున్సిపాలిటీ విషయంలో సెంచరీ దాటేసింది. ఇప్పటివరకు 103 మున్సిపాలిటీలను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. దాదాపు అన్ని జిల్లాల్లోనూ టీఆర్‌ఎస్‌ ఆధిక్యంలో ఉంది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో కారు సత్తా చాటింది. అన్ని మున్సిపాలిటీలోనూ గులాబీ పార్టీ విజయం సాధించింది. ఉమ్మడి కరీంనగర్‌లో కారుకు ఎదురులేదు. ఇక్కడ అన్ని మున్సిపాలిటీల్లోనూ టీఆర్‌ఎస్‌ విజయం సాధించింది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో టీఆర్‌ఎస్‌ హవా కొనసాగుతోంది. భైంసా మినహా  ఇక్కడ అన్ని మున్సిపాలిటీల్లోనూ కారు విజయం సాధించింది. ఇక, ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో టీఆర్‌ఎస్‌ దూకుడు మీద ఉంది. కామారెడ్డి మినహా అన్ని మున్సిపాలిటీలను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది.

  • రాష్ట్రంలో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ దూసుకుపోతోంది. మెజారిటీ మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్లలో కారు తిరుగులేనిరీతిలో సత్తా చాటింది. ఇప్పటివరకు (మధ్యాహ్నం 12 గంటలవరకు) అందుతున్న సమాచారం ప్రకారం 80కిపైగా మున్సిపాలిటీలు టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. ఇక, మూడు మున్సిపాలిటీలో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించింది. కొల్లాపూర్‌, ఐజా మున్సిపాలిటీల్లో జూపల్లి వర్గీయులు సత్తా చాటారు.

  • మహబూబ్‌నగర్‌: తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీ బోణీ కొట్టింది. ఆమన్‌గల్‌ మున్సిపాలిటీని బీజేపీ గెలుచుకుంది.
  • బోడుప్పల్‌ మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్‌ మేయర్‌ అభ్యర్థి సంజీవరెడ్డి ఓటమి
  • భువనగిరి మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్‌-కాంగ్రెస్‌ మధ్య హోరాహోరి నెలకొంది. ఇటు నల్లగొండ జిల్లాలోనూ టీఆర్‌ఎస్‌-కాంగ్రెస్‌ మధ్య హోరాహోరి పరిస్థితి కనిపిస్తోంది.
  • సంగారెడ్డి జిల్లాలో మంత్రి హరీశ్‌రావు వ్యూహం ఫలించింది. ఇక్కడి సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీలను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. ఈ రెండు మున్సిపాలిటీల్లోనూ స్థానిక కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది.
  • కొడంగల్‌లో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎంపీ రేవంత్‌రెడ్డికి షాక్‌ తగిలింది. కొడంగల్‌ మున్సిపాలిటీలో కేవలం మూడు వార్డుల్లో మాత్రమే కాంగ్రెస్‌ గెలుపొందింది.
  • టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్ ఇలాకాలో స్వతంత్ర అభ్యర్థులు సత్తా చాటారు. మొత్తం పది స్థానాల్లో స్వతంత్రులు గెలవడంతో అధికార టీఆర్ఎస్ అభ్యర్థులు షాక్‌ తిన్నారు. వీరిలో ఎక్కువమంది టీఆర్‌ఎస్‌ రెబెల్స్‌ ఉన్నట్టు తెలుస్తోంది. రెబెల్స్‌ గెలుపొందినా వారిని తిరిగి టీఆర్‌ఎస్‌లోకి తీసుకునేది లేదని కేటీఆర్‌ ఎన్నికల ప్రచారంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.

  • యాదాద్రి: ఆలేరు మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్‌ దూసుకుపోయింది. ఇక్కడ మొత్తం 12 వార్డుల్లోటీఆర్‌ఎస్ ఎనిమిది వార్డులు, టీఆర్‌ఎస్ రెబల్‌ అభ్యర్థులు రెండు వార్డుల్లో గెలుపొందగా.. కాంగ్రెస్‌,  బీజేపీ తలా వార్డులో విజయం సాధించారు.
     
  • ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కారు తిరుగులేని జోరు ప్రదర్శిస్తోంది. నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లోని మొత్తం ఏడు మున్సిపాలిటీల్లో ఇప్పటివరకు నాలుగు  మున్సిపాలిటీలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. భీమ్గల్‌, బాన్సువాడ, ఆర్మూరు, ఎల్లారెడ్డి మున్సిపాలిటీల్లో గులాబీ పార్టీ సత్తా చాటింది.

    -  మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న బాల్కొండ నియోజకవర్గంలోని భీంగల్‌లో 12 వార్డులకు 12 వార్డులను గెలిచి టీఆర్ఎస్ క్లీన్‌స్వీప్ చేసింది.

    -  స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న బాన్సువాడలో మొత్తం 19 వార్డుల్లో టీఆర్ఎస్ 15 వార్డులు గెలిచి సత్తా చాటింది.

    - ఆర్మూరు మున్సిపాలిటీలో మొత్తం 36 వార్డుల్లో టీఆర్ఎస్ 22 గెలిచి ముందంజలో ఉంది.

    - ఎల్లారెడ్డిలోని 12 వార్డుల్లో ఏకంగా  పది వార్డులు టీఆర్ఎస్ గెలుపొందింది.

  • ఖమ్మం: కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర కోటకు బీటలు వారాయి. మధిర మున్సిపాలిటీలో మొదటి రౌండ్ ముగిసేసరికి ఎనిమిది వార్డులకుగాను ఐదుచోట్ల టీఆర్ఎస్  దూసుకుపోతోంది. ఇక్కడ కాంగ్రెస్‌, సీపీఐ, టీడీపీ కలిసి మహాకూటమిగా పోటీ చేశాయి. మూడు స్థానాల్లో కాంగ్రెస్, ఒక్కొక్క స్థానంలో టీడీపీ, సీపీఐ గెలిచాయి.
     
  • నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని మొత్తం ఏడు మున్సిపాలిటీల్లో ఇప్పటివరకు రెండు మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న టీఆర్ఎస్. భీమ్గల్‌, బాన్సువాడ మున్సిపాలిటీల్లో కారు జోరు.
  • నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్‌ క్లీన్‌స్వీప్‌ చేసింది. మొత్తం 12 వార్డుల్లో టీఆర్‌ఎస్‌ విజయాన్ని సాధించింది. మంత్రి ప్రశాంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మున్సిపాలిటీ భీమ్గల్‌ కావడం గమనార్హం.
  • కామారెడ్డి జిల్లా: బాన్సువాడ మున్సిపాలిటీని టీఆర్ఎస్ కైవసం చేసుకొంది. మొత్తం 19 వార్డుల్లో 11 వార్డులను టీఆర్‌ఎస్‌ సొంతం చేసుకొంది. ఒక వార్డులో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. పోలింగ్‌కు ముందే ఒక వార్డు 1 ఏకగ్రీవం అయింది.
  • నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ 22వ డివిజన్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి ఓటమి.. ఇండిపెండెంట్ అభ్యర్థి పైడి‌ మాధవి విజయం
  • రాజేంద్రనగర్‌లోనిబండ్లగూడ కార్పొరేషన్ పరిధిలోని 6వ డివిజన్‌లో రజియా సుల్తానా విజయం
  • మేడ్చల్ జిల్లా: గుండ్లపోచంపల్లి ఐదో వార్డు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బాలరాజు విజయం
  • మేడ్చల్ జిల్లా : గుండ్లపోచంపల్లి 11వ వార్డు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి జైపాల్ రెడ్డి విజయం
  • మేడ్చల్ జిల్లా :గుండ్లపోచంపల్లి 10వ వార్డు తెరాస అభ్యర్థి ప్రభాకర్ విజయం
  • రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మున్సిపాలిటీ తొమ్మిదో వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి మడుపతి చంద్రమౌళి గెలుపు
     
  • జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌ టీఆర్‌ఎస్‌ కైవసం
  • భైంసా నాలుగు వార్డుల్లో ఎంఐఎం గెలుపు
  • వర్థన్నపేట మున్సిపాలిటీ టీఆర్‌ఎస్‌ కైవసం
  • మీర్‌పేట్‌లో మున్సిపాలిటీ 1, 4, 10,19 వార్డుల్లో టీఆర్‌ఎస్‌ గెలుపు
  • హుస్నాబాద్‌ 13, 19 వార్డుల్లో టీఆర్‌ఎస్‌ విజయం
  • చిట్యాల మున్సిపాలిటీ 7,10 వార్డుల్లో టీఆర్‌ఎస్‌ గెలుపు
  • హూజుర్‌ నగర్‌ 9,12 వార్డుల్లో కాంగ్రెస్‌ విజయం

  • ధర్మపురి మొత్తం వార్డులు 15 : టీఆర్‌ఎస్‌ 8, కాంగ్రెస్‌ 7 గెలుపు
  • తెలంగాణ భవన్‌కు  చేరుకున్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటిఆర్
  • హుజూర్‌నగర్‌, సూర్యాపేట, మహబూబ్‌నగర్‌లో టీఆర్‌ఎస్‌ ముందంజ
  • సత్తుపల్లి పదోవార్డు టీఆర్‌ఎస్‌ గెలుపు
  • బొల్లారం 16, 17, 18 వార్డుల్లో టీఆర్‌ఎస్‌ ​గెలుపు
  • పెద్దపల్లి జిల్లా  రామగుండం కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్ శ్రీ దేవసేన
  • మంచిర్యాలలో గంటకు పైగా ఆలస్యంగా కౌంటింగ్, ఇప్పటికీ ప్రారంభం కానీ బ్యాలెట్ బాక్స్‌ల లెక్కింపు
  • యాదాద్రి జిల్లాలో మొదలైన క్యాంప్ రాజకీయాలు.. యాదగిరిగుట్టలో తమ అభ్యర్థులను రహస్య ప్రాంతానికి తరలించిన కాంగ్రెస్
  • ప్రారంభమైన పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు
  • భైంసాలో మొత్తం పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు 14
  • అనూహ్యంగా బీజేపీకి 8, ఎంఐఎం 3, కాంగ్రెస్‌ 1,ఇతరులకు 1 ఓటు
  • జగిత్యాల పోస్టల్ బ్లాలెట్ లెక్కింపులో ఆలస్యం, ఇంకా ప్రకటించని పోస్టల్‌ బ్యాలెట్ వివరాలు
  • సిరిసిల్లలో ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ కృష్ణ భాస్కర్
  • వరంగల్‌ నర్సంపేట్‌లో ఏడు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు తిరస్కరణ
  • సదాశివపేట మున్సిపల్ ఎన్నికల్లో 47 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి
  • మున్సిపల్‌ ఎన్నికల్లో కొత్త ట్రెండ్‌.. ఫలితాలు రాకముందే క్యాంపులకు అభ్యర్థులు
  • హైదరాబాద్‌ క్యాంపుకు తరలివెళ్తున్న ఉమ్మడి నిజామాబాద్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు
  • ఇల్లందులో పోస్టల్‌ బ్యాలెట్‌ బాక్సులకు సీల్‌ వేయని అధికారులు
  • మహేశ్వరం, నాదర్‌గుల్‌ కేంద్రం వద్ద బీజేపీ ఆందోళన
  • అభ్యర్థులు రాకముందే సీల్‌ తెరిచారని ఆరోపణ
  •  రామగుండం కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రంలో రభస
  • రామగుండం కేంద్రంలోకి వెళ్లిన ఎమ్మెల్యే చందర్‌.. బయటకు రావాలని అభ్యర్థుల ఆందోళన

మరిన్ని వార్తలు