‘బుజ్జగింపుల బాధ్యత వారిదే’

4 Jan, 2020 15:21 IST|Sakshi

పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌ : మున్సిపల్‌ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ దూకుడు పెంచింది. తెలంగాణ భవన్‌లో శనివారం జరిగిన టీఆర్‌ఎస్‌ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా సర్వేలన్నీ టీఆర్‌ఎస్‌కే అనుకూలంగా ఉన్నాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. కేసీఆర్‌ మాట్లాడుతూ..  
(చదవండి : షెడ్యూల్ విడుదల చేసిన ఎన్నికల సంఘం)

‘సర్వేలన్నీ మనకే అనుకూలంగా ఉన్నాయి. 120 మున్సిపాలిటీలు,10 కార్పొరేషన్‌లలో మనమే గెలుస్తున్నాం. బీజేపీ మనకు పోటీ అనే అపోహలు వద్దు. మనకు ఎవరితో పోటీ లేదు. పాత, కొత్త నాయకులు సమన్వయంతో పనిచేయాలి. పార్టీ ఒకసారి అభ్యర్థిని ఫైనల్ చేసిన తర్వాత ఆ అభ్యర్థి గెలుపు కోసమే పని చెయ్యాలి. అవసరం ఉన్న చోట మంత్రులు ఎన్నికల ప్రచారం చేస్తారు. టికెట్ల పంపిణీ, రెబల్స్‌ బుజ్జగింపులు అన్నీ ఎమ్మెల్యేలదే బాధ్యత’అని కేసీఆర్‌ అన్నారు. ఇక లంచ్ విరామం తరువాత ఉమ్మడి జిల్లాల వారిగా పార్టీ నాయకుల సమావేశం జరుగుతుంది. ఆ సమావేశం అనంతరం కేసీఆర్ తిరిగి సమావేశాన్ని ప్రారంభిస్తారు.

మరిన్ని వార్తలు