అసలు వాళ్లు ఏపీ పోలీసులేనా?

29 Oct, 2018 16:09 IST|Sakshi

ఎంత మంది వచ్చారు? ఎందుకొచ్చారు?

ఎన్ని రోజులుగా మకాం వేశారు?

ఎవరెవరిని కలిశారు?

ఇక్కడ వారికి ఆశ్రయం కల్పించిందెవరు?

ఎవరికైనా డబ్బులు పంపిణీ చేశారా? అనే కోణాల్లో తెలంగాణ పోలీసుల విచారణ

ఏపీ ఇంటెలిజెన్స్‌ సర్వేపై కూపీ లాగుతున్న పోలీసులు

16 మంది నుంచి వివరాలు సేకరించిన స్పెషల్‌ బ్రాంచ్‌ డీఎస్పీ

ముగ్గురికి టీడీపీ నేతలు ఆశ్రయం ఇచ్చినట్టు నిర్ధారణ

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేల కొనుగోళ్లకు బేరసారాలాడి అడ్డంగా దొరికిపోయిన ఏపీ సీఎం చంద్రబాబు.. ఇపుడు పక్క రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ప్రజాధనంతో జీతాలు తీసుకుంటున్న ఏపీ పోలీసులను తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు. తెలంగాణ ఎన్నికలపై ఇంటెలిజెన్స్ పోలీసుల ద్వారా సర్వే చేయిస్తున్నారు. ఈసీ ఆదేశాలతో విచారణ చేపట్టిన తెలంగాణ పోలీసులు చంద్రబాబు బండారాన్ని బట్టబయలు చేశారు.

జగిత్యాల జిల్లాలో ఏపీ ఇంటెలిజెన్స్‌ పోలీసుల సర్వే చేసిన ఘటనపై తెలంగాణ పోలీసులు కూపీ లాగుతున్నారు. ఈ నెల 27న ధర్మపురిలో ఏపీ ఇంటెలిజెన్స్‌ పోలీసుల సర్వేపై మంత్రి కేటీఆర్‌తోపాటు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్‌ సీరియస్‌ అయ్యారు. జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన రాష్ట్రంలో కలకలం రేపింది. దీంతో ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ పోలీసు శాఖను ఆదేశించింది. వెంటనే రంగంలో దిగిన పోలీసులు సంఘటనపై నిజానిజాలు నిగ్గు తేల్చే పనిలోపడ్డారు. ఇందులో భాగంగా ఆదివారం ధర్మపురి పోలీస్‌స్టేషన్‌లో జగిత్యాల స్పెషల్‌ బ్రాంచ్‌ ఏఆర్‌ డీఎస్పీ సీతారాములు సుదీర్ఘ విచారణ చేపట్టారు. స్థానిక టీడీపీ, టీఆర్‌ఎస్‌ నాయకులతోపాటు మొత్తం 16 మందిని విచారణ చేశారు. ధర్మపురిలో అనుమానాస్పదంగా సర్వే నిర్వహిస్తూ స్థానికులకు చిక్కిన ముగ్గురు అసలు ఏపీ పోలీసులేనా? ఎంత మంది వచ్చారు? ఎందుకొచ్చారు? ఎన్ని రోజులుగా మకాం వేశారు? ఎవరెవరిని కలిశారు? ఇక్కడ వారికి ఆశ్రయం కల్పించిందెవరు? ఎవరికైనా డబ్బులు పంపిణీ చేశారా? అనే కోణాల్లో విచారణ నిర్వహించారు.

అనుమానాస్పదంగా తిరుగుతూ స్థానికులకు పట్టుబడ్డ ముగ్గురిలో ఒకరు వారం రోజులక్రితమే ధర్మపురికి వచ్చాడని.. నాలుగు రోజుల క్రితం మరో ఇద్దరు వచ్చారని స్థానికులు పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిసింది. తర్వాత ముగ్గురూ భక్తులమని చెప్పుకుంటూ స్థానిక టీటీడీ ధర్మశాలలోనే మకాం వేశారని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. వీరికి స్థానిక టీడీపీ నాయకులు ఆశ్రయం కల్పించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఆదివారం టీడీపీకి చెందిన పలువురిని పోలీస్‌స్టేషన్‌కు పిలిపించిన స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులు.. సర్వే చేసిన ముగ్గురు వ్యక్తులకు వారు ఎలాంటి సహకారం అందించారన్నది ఆరా తీశారు. ఆ ముగ్గురు కొంతమందితో మాట్లాడినట్లు తెలుసుకుని ఓ హోటల్‌ యజమాని, ఇద్దరు కారు డ్రైవర్ల నుంచి కీలక సమాచారాన్ని పోలీసులు రాబట్టినట్టు తెలుస్తోంది. ఇందులో ఒకరు.. అనుమానాస్పద వ్యక్తి వద్ద ఓ సీల్డ్‌ కవర్‌ చూశానని చెప్పాడు. అదేంటని తాను అడిగితే మీకు సంబంధం లేదని అతను బదులిచ్చినట్లు ఆ వ్యక్తి పోలీసులకు వెల్లడించాడు.  

అయితే, ఈ ఘటనపై టీడీపీ సీనియర్‌ నేత ఒకరు వివరణ ఇస్తూ ‘భారత పౌరులెవరైనా, వారికి ఆశ్రయం ఇవ్వడంలో తప్పు లేదు. అయితే, వచ్చిన వాళ్లు ఇక్కడ ఏం సర్వే చేశారో మాకు తెలియదు. వారినే అడిగితే తెలుస్తుంది. మేం ఎవరికీ అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదు. ఆర్డర్‌ ఇవ్వలేదు. మాకు ఇతరులతో సర్వే చేయించుకోవాల్సిన అవసరం లేద’ని పేర్కొన్నట్టు సమాచారం. ధర్మపురిలో ఏపీ ఇంటెలిజెన్స్‌ పోలీసుల పర్యటనపై టీఆర్‌ఎస్‌ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ ఘటనపై విచారణ చేపడుతున్నట్టు జగిత్యాల ఎస్పీ తెలిపారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కర్ణాటకం : విశ్వాస పరీక్షకు మరో డెడ్‌లైన్‌

మెగాస్టార్‌ చిరంజీవి మమ్మల్ని సంప్రదించలేదు

ప్రియాంక గాంధీని అడ్డుకున్న అధికారులు..!

ప్రతిపక్షం తీరు కుక్కతోక వంకరే: సీఎం జగన్

‘కర్నాటకం’లో కొత్త మలుపు

‘షరతులకు లోబడి లేకపోతే చర్యలు’

‘అప్పటి నుంచి మైండ్‌ మరింత దెబ్బతిన్నట్టుంది’

యడ్యూరప్ప చేతులు జోడించి వేడుకున్నారు కానీ..

పోలవరంపై టీడీపీకి మాట్లాడే హక్కు లేదు

‘అది తప్పుడు ప్రచారం; ప్రజల దృష్టికి తీసుకెళ్లండి’

‘బాబు స్వార్ధం కోసం సభను వాడుకుంటున్నారు’

కర్నాటకం; అసెంబ్లీలోనే భోజనం, నిద్ర

'అధ్యక్షా.. మమ్మల్ని వెనుకబెట్టారు'

‘నన్నెవరూ కిడ్నాప్‌ చేయలేదు’

మాకు ప్రతిపక్ష హోదా కల్పించండి

‘బీజేపీలో ఎప్పుడు చేరేది త్వరలోనే చెబుతా’

కాంగ్రెస్‌లో ‘కంగాళీ’

కర్నాటకం క్లైమాక్స్‌ నేడే

సభ సంకేతాలతో నడుస్తోంది 

నిలబెట్టుకోలేక నిందలా!

కుమారస్వామికి గవర్నర్‌ డెడ్‌లైన్‌

‘సీఎం జగన్‌ చారిత్రక నిర్ణయం తీసుకున్నారు’

బీజేపీలో నాకు తలుపులు మూసుకుపోలేదు..

బీజేపీలో చేరిన 13 మంది సెలబ్రిటీలు!

కేటీఆర్‌.. మీతో ఛాయ్‌ కా, ఇంకేమైనా ఉందా?

కర్ణాటకం : విశ్వాస పరీక్ష రేపటికి వాయిదా

కర్ణాటకం : గవర్నర్‌ సూచనతో మారిన సీన్‌

4 వేల కి.మీ.; మరో వారసుడి ప్రజాయాత్ర!

కర్ణాటక అసెంబ్లీలో గందరగోళం

కర్ణాటక అసెంబ్లీ మ.3గంటల వరకూ వాయిదా

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ అరెస్టు

‘ఆ విషయాలు నాగార్జున తెలుసుకోవాలి’

పీవీ కూడా ఆయన అభిమాని అట...

‘ది లయన్‌ కింగ్‌’.. ఓ విజువల్‌ వండర్‌!

‘సాహో’ విడుదల ఎప్పుడంటే..?

ఘోర రోడ్డు ప్రమాదం : బాలనటుడు దుర్మరణం