కూటమి ఏర్పాటు దిశగా టీడీపీ.. చాడకు రమణ ఫోన్‌

9 Sep, 2018 16:20 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్ : ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో టీటీడీపీ నేతలు మరో సారి సమావేశం కానున్నారు. కాంగ్రెస్‌తో పొత్తు తప్పదని పార్టీ అధినేత చంద్రబాబు స్పష్టం చేయడంతో మిగతా పార్టీలతో కూటమి కట్టేందుకు టీటీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు పొత్తులపై చర్చలకు రావాలంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డికి టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌ రమణ ఆహ్వానించారు. సాయంత్రం సీపీఐ నేతలతో టీడీపీ నేతలు సంప్రదింపులు జరుపనున్నారు. సోమవారం ఉదయం టీజేఎస్ అధినేత కోదండరాంతో కూడా టీడీపీ నేతల సమావేశం కానున్నారు. మంగళవారం జరిగే ఆల్‌పార్టీ సమావేశం తర్వాత పొత్తులపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

కమిటీల ఏర్పాటు
ముందస్తు ఎన్నికల నేపథ్యంలో టీటీడీపీ మూడు కమిటీలను ఏర్పాటు చేసింది. పొత్తుల సంప్రదింపుల కమిటీ, మేనిఫెస్టో కమిటీ, ప్రచార కమిటీల జాబితాను సిద్ధం చేసింది. పొత్తుపై సంప్రదింపులకు ఎల్‌.రమణ నేతృత్వంలో ఏడుగురితో కమిటీ వేశారు. దేవేందర్‌గౌడ్‌ నేతృత్వంలో ఐదుగురితో మేనిఫెస్టో కమిటీ, గరికపాటి మోహన్‌రావు నేతృత్వంలో ఎన్నికల ప్రచార కమిటీని ఏర్పాటు చేశారు.

మరిన్ని వార్తలు