ప్రచారానికి తెర

9 May, 2019 06:43 IST|Sakshi

సాక్షిప్రతినిధి, ఖమ్మం: రెండో దశ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌ నిర్వహించే స్థానాల్లో బుధవారం సాయంత్రం 5గంటలకు ప్రచారం ముగిసింది. గత కొన్ని రోజులుగా ఓట్ల అభ్యర్థన, వివిధ రూపాల్లో ప్రచారంతో హోరెత్తిన ఆయా గ్రామాల్లో మైకులు ఇక మూగబోయాయి. రెండో దశలో ఏన్కూరు, కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, తల్లాడ, వేంసూరు జెడ్పీటీసీ స్థానాలకు, 82 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. జెడ్పీటీసీ స్థానాల్లో 34మంది, ఎంపీటీసీ స్థానాల్లో 282మంది పోటీపడుతున్నారు. మొత్తం 85 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా.. మూడు ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. సత్తుపల్లి మండలం బుగ్గపాడు, కల్లూరు మండలం ఎర్రబోయినపల్లి, వేంసూరు మండలం భీమవరం ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి.

దీంతో 82 ఎంపీటీసీ స్థానాల కు ఎన్నికలు నిర్వహిస్తున్నారు.  ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, టీడీపీ, బీజేపీ అభ్యర్థులు బరిలో ఉన్నారు. విజయం కోసం ఆయా పార్టీల అభ్యర్థులు హోరాహోరీ ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ తమకు ఓటు వేయాలని కోరారు. అలాగే ఆటోలు తదితర వాహనాలపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి మైకుల ద్వా రా గ్రామాల్లో ప్రచారాన్ని హోరెత్తించారు. స్థానిక సంస్థల ఎన్నికలు కావడం, అభ్యర్థులంతా వారి ప్రాంతాల్లో ఓటర్లకు పరిచయం ఉన్న వారు కావడంతో పోరు రసవత్తరంగా మారింది.

అభ్యర్థులు ప్రతి ఒక్కరినీ కలుస్తూ తమకు ఓటు వేయాలని కోరుతూ ప్రచారం నిర్వహించారు. అభ్యర్థులతో పాటు ఆయా పార్టీల నాయకులు, శాసనసభ్యులు కూడా ప్రచారంలో పాల్గొన్నారు. ప్రస్తుతం తెర పడడంతో వ్యూహ,ప్రతివ్యూహాలకు పదును పెడు తున్నారు. గెలుపు కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్, కాం గ్రెస్‌ పార్టీల మధ్యనే హోరాహోరీ పోరు నెలకొం ది. దీంతో ఆయా పార్టీల నాయకులు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం నిర్వహించారు. జిల్లాస్థాయి, మండల స్థాయి నాయకు లు జెడ్పీటీసీ, ఎంపీటీసీస్థానాలను అధికంగా గెలుచుకునేందుకువ్యూహరచన చేస్తున్నారు. ఎన్ని కలను నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. పోలీస్‌ భద్రత నడుమ బ్యాలెట్‌ బాక్సులను నేడు తరలించనున్నారు.

మరిన్ని వార్తలు