రేపే రెండో విడత పరిషత్‌ ఎన్నికలు

9 May, 2019 10:20 IST|Sakshi
ర్యాండమైజేషన్‌లో పాల్గొన్న ఎన్నికల పరిశీలకురాలు అభిలాష్‌ బిస్త్, రెండు జిల్లాల కలెక్టర్లు 

రెండో విడత మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికల ప్రచార పర్వం బుధవారం సాయంత్రంతో ముగిసింది. అభ్యర్థులు ప్రలోభాల పర్వానికి తెరలేపారు.  విందులు ఏర్పాటు చేస్తున్నారు. వస్తు సామగ్రితో పాటు మద్యం, డబ్బులు పంపిణీ చేస్తున్నారు. బోధన్‌ డివిజన్‌లో ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు.

ఇందూరు(నిజామాబాద్‌ అర్బన్‌): రెండో విడత పరిషత్‌ ఎన్నికలకు సంబంధించి సిబ్బంది కేటాయింపు పూర్తయింది. ఈ మేరకు కలెక్టరేట్‌లోని ఎన్‌ఐసీ కార్యాలయంలో సాధారణ పరిశీలకులు అభిలాష్‌ బిస్త్, నిజామాబాద్, కామారెడ్డి కలెక్టర్లు రామ్మోహన్‌ రావు, సత్యనారాయణల ఆధ్వర్యంలో పోలింగ్‌ కేంద్రాల వారీగా సిబ్బందిని కేటాయిస్తూ ర్యాండమైజేషన్‌ను నిర్వహించారు. బోధన్‌ డివిజన్‌లో జరిగే ఎన్నికలకు సంబంధించి 412 పోలింగ్‌ కేంద్రాలకు సిబ్బందిని కేటాయించారు.

ఇందుకు 494 మంది ప్రిసైడింగ్, 494 సహాయ ప్రిసైడింగ్‌ అధికారులు, 1871 మంది అదనపు అధికారులను కేటాయించారు. కామారెడ్డి జిల్లాకు సంబంధించి బాన్సువాడ డివిజన్‌లో 426 పోలింగ్‌ కేంద్రాలకు 511 మంది పీఓలు, 511 మంది ఏపీఓలు, 1916 మంది ఇతర అధికారులను కేటాయించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో అంజయ్య, జడ్పీ సీఈఓ వేణు, ఇతర అధికారులున్నారు.

మరిన్ని వార్తలు