జోరుగా నామినేషన్లు

2 May, 2019 08:28 IST|Sakshi

ఇచ్చోడ: జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్ల పర్వం ఊ పందుకుంది. మూడో విడతలో ఎన్నికలు జరిగే ఆయా స్థానా ల కు మంగళవారం నుంచి నామినేష న్లు స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. బుధవారం జోరుగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఆయా మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన నామినేషన్‌ కేంద్రాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ రిటర్నింగ్‌ అధికారులు ఉదయం నుంచి సాయంత్రం వరకు అందుబాటులో ఉండి అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించారు. మూడో విడతలో ఎన్నికలు జరిగే స్థానాలకు నామినేషన్‌ దాఖలు చేసేందుకు గురువారం ఆఖరు గడువు ఉంది. దీంతో చివరి రోజు అధిక సంఖ్యలో నామినేషన్లు దాఖలు అయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి.
 
రెండో రోజు 160 నామినేషన్లు.. 
మూడోవిడత నామినేషన్ల స్వీకరణ ప్రక్రియలో భాగంగా రెండో రోజు మొత్తం 160 నామినేషన్లు దాఖలయ్యాయి. ఆరు మండలాల్లోని ఆరు జెడ్పీటీసీ, 58 ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. బుధవారం ఒక్కరోజే ఆరు జెడ్పీటీసీ స్థానాలకు 26 నామినేషన్లు రాగా, 58 ఎంపీటీసీ స్థానాలకు 134 నామినేషన్లు వచ్చాయి. ఇచ్చోడ,సిరికొండ, ఇంద్రవెల్లి, నార్నూర్, గాదిగూడ, ఉట్నూర్‌లోని ఎంపీటీసీ స్థానాలకు బీజేపీ నుంచి మొత్తం 35 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేయగా, కాంగ్రెస్‌ నుంచి 39, టీఆర్‌ఎస్‌ నుంచి 46, ఇతర పార్టీ నుంచి ఒకటి, స్వతంత్రులు 13మంది అభ్యర్థులు నామినేషన్లు చేశారు. మండలాల్లోని జెడ్పీటీసీ స్థానాలకు మొత్తం 26 నామినేషన్లు దాఖలు కాగా ఇచ్చోడలో ఏడు, సిరికొండలో రెండు, ఇంద్రవెల్లి లో మూడు, నార్నూర్‌లో ఐదు, గాదిగూడలో ఆ రు, ఉట్నూర్‌లో మూడు నామినేషన్లు వచ్చాయి.
 
నామినేషన్ల దాఖలుకు నేడు ఆఖరు.. 

మూడో విడతలో ఎన్నికలు జరిగే ఆరు మండలాల్లోని  పోటీ పడే అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేసేందుకు గురువారం ఆఖరు గడువుగా ఉంది. అనంతరం శుక్రవారం నామినేషన్లను ప రిశీలన ప్రక్రియ కొనసాగనుంది. పరిశీలనలో తి రస్కరించిన నామినేషన్లపై అప్పీలు చేసుకునేం దుకు శనివారం వరకు గడువుంది. తద్వారా నా మినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగనుంది. ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన వెంటనే  బరి లో ఉండే అభ్యర్ధుల జాబితాను ప్రకటించనున్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వేలూరు లోక్‌సభకు ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

కుటుంబ కథా చిత్రం!

ఒక్కో ఓటుపై రూ.700

అలా అయితే ఫలితాలు మరోలా ఉండేవి: పవన్

రాజ్‌నాథ్‌ రాజీనామాకు సిద్ధపడ్డారా?

రెండు చోట్ల అందుకే ఓడిపోయా: పవన్‌

గడ్కరీ ఓడిపోతాడు.. ఆడియో క్లిప్‌ వైరల్‌!

సీఎంతో విభేదాలు.. కేబినెట్‌ భేటీకి డుమ్మా!

నిస్సిగ్గుగా, నిర్లజ్జగా కొంటున్నారు

మాయ, అఖిలేష్‌ల ఫెయిల్యూర్‌ స్టోరీ

అంతా మీ వల్లే

బాబు వైఎస్సార్‌సీపీలోకి వెళితే నేను..

కేశినేని నాని కినుక వెనుక..

కొన్నిసార్లు అంతే.. !!

ఎంపీ కేశినేని నానితో గల్లా భేటీ

‘మాతో పెట్టుకుంటే పతనం తప్పదు’

టీడీపీకి ఎంపీ కేశినేని నాని షాక్‌!

చీఫ్‌ విప్‌గా మార్గాని భరత్‌ రామ్‌

‘మహాఘఠ్‌ బంధన్‌’ చీలిపోయింది...

గిరిరాజ్‌కు అమిత్‌ షా వార్నింగ్‌

అఖిలేశ్‌ భార్యను కూడా గెలిపించుకోలేకపోయాడు!

యూపీలో కూటమికి బీటలు..?

జగన్‌ పాలనను.. చూస్తున్నారా చంద్రబాబూ?

సంఖ్యే ముఖ్యం... శాతం కాదు

గాంధీజీపై ఐఏఎస్‌ అధికారిణి వివాదాస్పద వ్యాఖ్య

బదులు తీర్చుకున్న నితీశ్‌

నితీశ్‌ కేబినెట్‌లోకి కొత్త మంత్రులు.. బీజేపీకి కౌంటర్‌!

మళ్లీ అదే జోడీ

‘త్రిభాష’పై తమిళ పార్టీల కన్నెర్ర

రక్షణ బాధ్యతల్లో రాజ్‌నాథ్‌