అమ్మో! ఆ భవనాలు రాహుల్‌ గాంధీవా!!?

30 Apr, 2019 18:50 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ :‘రాజీవ్‌ గాంధీ కుమారుడు పప్పూకు చెందిన భవనాలివి. అతి ఖరీదైన విలాసవంతమైన ఈ భవనాలను భారత దేశాన్ని యావత్తు దోచుకొని కొన్నాడు పప్పూ. నేను ఇప్పుడు ఇటలీలో ఉన్నాను. ఇగో ఇవి రాజీవ్, సోనియా గాంధీలకు చెందిన భవనాలు. వీటిని అద్దెకు ఇవ్వడం ద్వారా ఇండియాలో కూర్చొని పప్పూ డబ్బులు దండుకుంటున్నాడు. ఇక పప్పూ పని అయిపోయిట్లే. ఆయన్ని భారత్‌ నుంచి తరిమేయాల్సిందే. జై శ్రీకష్ణ, నేను ఇటలీలో ఉన్నా ’ అంటూ మధ్య వయస్కుడైన  ఓ గుజరాతీ గుజరాతీ భాషలో మాట్లాడిన ఈ వీడియోను ‘మేరా భారత్‌ మహాన్‌’ అనే ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. ఈ వీడియోను ఇప్పటికే రెండు లక్షల మందికిపైగా వీక్షించగా, 20 వేల మంది వరకు షేర్‌ చేసుకున్నారు.ఆర్‌బీఐ డైరెక్టర్‌ ఎస్‌. గురుమూర్తి ఈ వీడియోను రీట్వీట్‌ చేయడం గమనార్హం. ఇది ఫేక్‌ న్యూస్‌ అని సులభంగానే గ్రహించ వచ్చు. ఈ భవనాలను పప్పూ కొన్నడని ఓ చోట, రాజీవ్‌ గాంధీ, సోనియా గాంధీ భవనాలని మరో చోట మాట్లాడారు. అంతేకాకుండా భవనాలు శిఖరం వరకు పూర్తిగా కనిపించేలా వీడియో తీయలేదు. పూర్తిగా చూపిస్తే ఎక్కువ గుర్తు పడతారేమోనన్న భయం కావచ్చు! అవి సాధారణ భవనాలయితే గుర్తు పట్టకపోవచ్చునేమోగానీ అవి ఇటలీలో ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రాంతానికి చెందినవి. వీడియోలో చూపించిన భవనాలు ఇటలీ టూరిన్‌ నగరంలోని ‘పిజ్జా క్యాస్టెల్లో’ సెంటర్‌కు చెందినవి. ఇందులో రాయల్‌ ప్యాలెస్‌తోపాటు మూడు ప్రాచీన చారిత్రక కట్టడాలు ఉన్నాయి. వీటిల్లో మ్యూజియంలు, సినిమా థియేటర్లు నడుస్తున్నాయి. వీటిని ఎవరు, ఎవరికి అమ్మడానికి, కొనడానికి వీల్లేదు. ఎందుకంటే, యునెస్కో చారిత్రక కట్టడాల సంరక్షణ జాబితాలో ఈ భవనాలు ఉన్నాయి. లోక్‌సభ ఎన్నికలకు మరో మూడు విడతల పోలింగ్‌ ఉండడంతో రాహుల్‌ గాంధీని భ్రష్టు పట్టించాలనే ఉద్దేశంతో ఈ ఫేక్‌ న్యూస్‌ను సర్కులేట్‌ చేస్తున్నారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పట్టు పెంచిన మజ్లిస్‌

ఆర్‌ఎస్‌ఎల్‌పీకి భారీ షాక్‌

ఎన్నికల కోడ్‌ను ఎత్తివేసిన ఈసీ

ఐదోసారి సీఎంగా నవీన్‌

మా అన్నకు ఎవ్వరూ తోడు రాలేదు

కలిసి పనిచేయాలని ఉంది

ప్రపంచ శక్తిగా భారత్‌

మోదీ కేబినెట్‌పై మిత్రపక్షాల కన్ను

మే 30, రాత్రి 7 గంటలు

టార్గెట్‌ @ 125

ఇక అసెంబ్లీ వంతు!

మమతకు అసెంబ్లీ గండం

ఒక్కసారిగా మా తండ్రిని తల్చుకున్నాను: వైఎస్‌ జగన్‌

తల్లి ఆశీర్వాదం కోసం గుజరాత్‌కు మోదీ

ఉప్పులేటి కల్పనకు అచ్చిరాని టీడీపీ..

‘ఆది’ నుంచి పార్టీ అంతం వరకూ...

పులివెందుల.. రికార్డుల గర్జన

ఆ నిబద్ధతే ‘నందిగం’ను ఎంపీని చేసింది..

30న ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం

బొండా, బోడే, కొల్లు తొలిసారితో సరి.. 

ఓటమిపై స్పందించిన నారా లోకేశ్‌‌!

ఒక్క మ్యాచే.. బాధపడొద్దు : జడేజా

మొత్తం వ్యవస్థల్ని ప్రక్షాళన చేస్తాం: వైఎస్‌ జగన్‌

వైఎస్‌ జగన్‌కు హామీ ఇచ్చా: మోదీ

 29న బెజవాడకు సీఎం కేసీఆర్‌