ఆ మండలాలు రెండు నియోజకవర్గాల్లో విలీనం

12 Oct, 2018 02:05 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీ నం చేశాక వాటిని అక్కడి రెండు నియోజకవర్గాల్లో కలిపేశామని కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) హైకోర్టుకు విన్నవించింది. ప్రజాప్రాతినిధ్య చట్టం లోని సెక్షన్‌ 9 (బి) ద్వారా సిద్ధించిన అధికారాల మేరకు నియోజకవర్గాల పునర్విభజన ఉత్తర్వులు–2015ను అమలు చేశామని సీఈసీ తెలిపింది. దీనివల్ల తెలంగాణలోని చట్ట సభ నియోజకవర్గాల్లో ఏవిధమైన మార్పు లేదని.. సీఈసీ తరఫున తెలంగాణ ఎన్నికల డిప్యూటీ ప్రధానాధికారి ఎం.సత్యవేణి కౌంటర్‌ వ్యాజ్యం లో పేర్కొన్నారు.

అలాగే కాంగ్రెస్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని కొట్టేయాలని కోరారు. తెలంగాణలోని ఏడు మండలాల్ని ఏపీలో విలీనం చేశాక అందుకు అనుగుణంగా నియోజకవర్గాల పునర్విభజన చేయలేదని, ఇప్పుడు ఎన్నికలు నిర్వహించడం రాజ్యాంగ వ్యతిరేకమని పేర్కొంటూ కాంగ్రెస్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై గతంలో విచారించిన హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు సీఈసీ కౌంటర్‌ దాఖలు చేసింది. 

మరిన్ని వార్తలు