‘వైఎస్సార్‌ విగ్రహం ధ్వంసం; శ్రీరామ్‌ అంగీకరించారు’

16 Mar, 2020 14:21 IST|Sakshi

 సాక్షి, అనంతపురం : టీడీపీ నాయుడు పరిటాల శ్రీరామ్‌పై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. తండ్రి బాటలో హింసా రాజకీయ చేయాలని పరిటాల శ్రీరామ్‌ కుట్ర పన్నారని ధ్వజమెత్తారు. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, హిందూపూర్‌ ఎంపీ గోరంట్ల మాధవ్‌ సోమవారం జిల్లా ఎస్పీ సత్య యేసుబాబుని కలిశారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ కార్యకర్తల తలలు నరుకుతామంటూ శ్రీరామ్‌ చేసిన వ్యాఖ్యాల వీడియో ఫుటేజీని ఎస్పీకి అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ.. పరిటాల శ్రీరామ్‌ దౌర్జన్యాలను ఖండిస్తున్నామన్నారు. రామగిరిలో వైఎస్సార్‌ విగ్రహన్ని ధ్వంసం చేశారని శ్రీరామ్‌ స్వయంగా అంగీకరించరన్నారు. మా జోలికొస్తే తలలు నరుకుతామని శ్రీరామ్‌ చేసిన వ్యాఖ్యలను పోలీసులు సీరియస్‌గా తీసుకోవాలని కోరారు. ‘చంద్రబాబుకు కరోనా వైరస్‌ సోకిందా..!)  

ఏపీలోకరోనా వైరస్‌ లేదని, ఎల్లో వైరస్‌ ఉందని తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబు వైరస్‌ ప్రభావం రాష్ట్ర ఎన్నికల సంఘంపై చూపుతోందన్నారు. ఎన్నికల అధికారి రమేష్‌ చౌదరి కూతురుకి చంద్రబాబు ఆర్థిక మండలి డైరెక్టర్‌ పదవి ఇచ్చారని, రమేష్‌ చౌదరి చంద్రబాబు రుణం తీర్చుకుంటున్నారని గుర్తు చేశారు. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ కాంగ్రెస్‌ ప్రభంజనం కొనసాగుతోందని, ముఖ్యమంత్రి వైస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీ అరికట్టారని తెలిపారు. ఓటమి భయంతోనే స్థానిక ఎన్నికలపై చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు.  ఏపీకి రూ. 5000 కోట్లు రాకూడదనే బాబు కుయుక్తులు పన్నుతున్నారని, రాష్ట్ర ప్రయోజనాలు ఆయనకు పట్టావా అని ప్రశ్నించారు.(‘ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని ఊహించలేదు’)

పది చోట్ల వైఎస్సార్‌ విగ్రహాలు ధ్వంసం
స్థానిక ఎన్నికలపై గవర్నర్‌ తక్షణమే జోక్యం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. వైఎస్సార్సీపీ నేతలు ప్రసాద్‌ రెడ్డి, శివారెడ్డి, కేశవరెడ్డి హత్య కేసుల్లో పరిటాల శ్రీరామ్‌ పాత్ర ఉందని ఆరోపించారు. తమ మంచితనాన్ని చేతకాని తనంగా భావించొద్దని శ్రీరామ్‌ను హెచ్చరించారు. మాజీ మంత్రి పరిటాల రవీంద్ర వందలాది మంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్నారని గుర్తు చేశారు. రాప్తాడు నియోజకవర్గంలో 10 చోట్ల వైఎస్సార్‌ విగ్రహాలను ధ్వంసం చేశారన్నారు. మాజీ మంత్రి పరిటాల సునీత కుటుంబ సభ్యుల అరాచకాలపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు.(ఫలించిన తోపుదుర్తి కృషి) 

బాబు రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలి
చంద్రబాబు కుట్ర రాజకీయాల వల్లే స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడ్డాయని ఎంపీ గోరంట్ల మాధవ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా ఉందని పార్లమెంటు వాయిదా వేయలేదని, లక్షల మంది కలిసే జాతరలు వాయిదా వేయలేదని అన్నారు. అలాగే ‘కేంద్రం నుంచి రావాల్సిన రూ. 5000 కోట్లు అడ్డుకుంటున్న దుర్మార్గుడు చంద్రబాబు. గ్రామాలు, పట్టాణాలకు నిధులు రాకుండా అడ్డుకోవడం చంద్రబాబుకు తగదు. చంద్రబాబు నీచ రాజకీయాలు మానుకోవాలి. ఏపీ అభివృద్ధికి సహకరించాలి. చంద్రబాబుకు దమ్ముంటే ఎన్నికల్లో వైఎస్సార్సీపీని ఎదుర్కోవాలి. స్థానిక ఎన్నికలు వెంటే జరపాలి’ అని టీడీపీపై విమర్శలు సంధించారు.

మరిన్ని వార్తలు