త్రిముఖపోటీతో ఎవరికి లాభం?

12 Mar, 2019 07:02 IST|Sakshi

ఆప్, కాంగ్రెస్‌ కలిస్తే బీజేపీకి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం

 ఢిల్లీ, గురుగ్రామ్‌ లో మే12న.. 

ఆప్‌తో పొత్తుకు సుముఖంగా లేని కాంగ్రెస్‌

నోయిడా, ఘాజియాబాద్‌ లో ఏప్రిల్‌ 11న పోలింగ్‌

ఏప్రిల్‌ 16 నుంచి మొదలుకానున్న నామినేషన్‌ ప్రక్రియ

సాక్షి, న్యూఢిల్లీ: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలో త్రిముఖ పోటీ జరిగినట్లితే బీజేపీకే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు రాజకీయ పరిశీలకులు అంటున్నారు. పాకిస్తాన్‌పై విమాన దాడులు కూడా పార్టీకి కలిసి రానున్నాయి. ఆమ్‌ ఆద్మీ పార్టీ కోరుతోన్న పొత్తుకు కాంగ్రెస్‌ సుముఖంగా లేకపోవడంతో రెండు పార్టీలు వేర్వేరుగా పోటీ చేస్తే ఓట్లు చీలి బీజేపీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అంచనా. రెండు పార్టీల ఓటు బ్యాంకు ఒకటే కనుక ఆప్, కాంగ్రెస్‌ కలిసి పోటీచేస్తే బీజేపీకి గట్టి పోటీ ఇస్తాయని  భావిస్తున్నారు. ఆప్‌తో జత కట్టినట్లయితే తమ పార్టీ కోలుకునే అవకాశాలు పూర్తిగా దెబ్బతింటాయని కాంగ్రెస్‌ భయపడుతోంది. రెండు పార్టీల మధ్య పొత్తు ఉండదని ఢిల్లీ కాంగ్రెస్‌ అ«ధ్యక్షరాలు షీలాదీక్షిత్‌ ప్రకటించినప్పటికీ పార్టీ ఈ విషయంపై పునరాలోచిస్తోందన్న సూచనలు వెలువడుతున్నాయి. ఢిల్లీ, గరుగ్రామ్‌లో మే12న, నోయిడా, ఘాజియాబాద్‌లో లోక్‌సçభ ఎన్నికల పోలింగ్‌ జరుగనుంది. ఢిల్లీలో అభ్యర్థుల నామినేషన్‌ ప్రక్రియ ఏప్రిల్‌ 16 మొదలుకానుంది. ఏప్రిల్‌ 23న నామినేషన్ల దాఖలుకు చివరి రోజు. ఏప్రిల్‌ 26 వరకు అభ్యర్థులు తమ నామినేషన్‌ ఉపసంహరించుకోవచ్చు. 12న పోలింగ్‌ జరుగుతుంది. ఈ సారి ఎన్నికల్లో 1,38,46,482 ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వారిలో 62,10,058 మంది మాహిళలు, 76,35,786 మంది పురుషులు, 638 మంది ఇతరులు ఉన్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. పోలింగ్‌ కోసం ఢిల్లీలో 2,606 చోట్ల 13,816 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఏడింటికి ఏడు సీట్లను గెలిచింది. 

న్యూఢిల్లీ: గత ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి ప్రముఖ న్యాయవాది మీనాక్షీ లేఖి గెలిచారు. ఈ సారి ఆప్‌ ఇక్కడి నుంచి బ్రిజేష్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. బీజేపీ మీనాక్షి లేఖిని గానీ, క్రికెటర్‌ గౌతం గౌతంగంభీర్‌ను గానీ నిలబెట్టవచ్చని అంటున్నారు. కాంగ్రెస్‌ మాజీ ఢిల్లీ అధ్యక్షుడు అజయ్‌మాకెన్‌కు టికెట్‌ ఇచ్చే అవకాశాలున్నాయి. 
చాందినీచౌక్‌: గత లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడి నుంచి డా. హర్షవర్థన్‌ గెలిచి కేంద్ర మంత్రి అయ్యారు. ఈ సారి ఆప్‌ ఇక్కడి నుంచి పంకజ్‌ గుప్తాను అభ్యర్థిగా ప్రకటించింది. బీజేపీ ఈ సారి విజయ్‌ గోయల్‌కు గానీ విజేందర్‌గుప్తాకు గానీ టికెట్‌ ఇచ్చే అవకాశాలున్నాయి. కాంగ్రెస్‌ నుంచి కపిల్‌ సిబల్, జేపీ అగర్వాల్, హరూన్‌ యూసఫ్‌ల పేర్లు వినిపిస్తున్నాయి.

దక్షిణ ఢిల్లీ: గత ఎన్నికల్లో ఇఈ స్థానం నుంచి రమేష్‌ బిధూడీ గెలిచారు. ఆప్‌ ఈసారి ఇక్కడి రాఘవ్‌ చద్దాను అభ్యర్థిగా ప్రకటించింది. కాంగ్రెస్‌ ఇక్కడి నుంచి యోగానందశాస్త్రికి గానీ చత్తర్‌సింగ్‌కు గానీ టికెట్‌ ఇచ్చే అవకాశాలున్నాయి. బీజేపీ మరోమారు రమేష్‌ బి«ధూడీని బరిలోకి దింపవచ్చు లేదా మాజీ ఎమ్మెల్యే రామ్‌వీర్‌సింగ్‌ బిధూడీని నిలబెట్టవచ్చు.

తూర్పు ఢిల్లీ: గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి మహేష గిరి గెలిచారు. ఆప్‌ ఈçసారి అతిïషిని అభ్యర్థిగా ప్రకటించింది. బీజేపీ ఇక్కడి నుంచి డా.హర్షవర్ధన్‌ను, కాంగ్రెస్‌ డా. ఎకెవాలియాను గానీ అర్విందర్‌ సింగ్‌ లవ్లీని గానీ నిలబెట్టవచ్చని అంటున్నారు.

ఈశాన్య ఢిల్లీ: గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి మనోజ్‌తివారీ గెలిచారు. ఆప్‌ ఈ సారి ఇక్కడి నుంచి దిలీప్‌ పాండేను అభ్యర్థిగా ప్రకటించింది. బీజేపీ ఢిల్లీ బిజెపి అధ్యక్షుడు మనోజ్‌ తివారీని గానీ, మాజీ ఎమ్మెల్యే మోహన్‌ సింగ్‌ బిష్త్‌ను గానీ అభ్యర్థిని చేయవచ్చు. కాంగ్రెస్‌ నుంచి కీర్తి ఆజాద్‌కు రేసులో ఉన్నారు.

వాయవ్య ఢిల్లీ: గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఉదిత్‌ రాజ్‌ గెలిచారు. ఆప్‌ ఈ సారి ఇక్కడి నుంచి గూగన్‌ సింగ్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. బీజేపీ దుష్యంత్‌కుమార్‌ గౌతంకు టికెట్‌ ఇస్తుందని అంటున్నారు. కాంగ్రెస్‌ నుంచి రాజ్‌కుమార్,రాజేష్‌ లిలోఠియా, జైకిషన్‌ల పేర్లు వినిపిస్తున్నాయి. 

పశ్చిమ ఢిల్లీ: గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి పర్వేష్‌ సింగ్‌ వర్మ గెలిచారు. ఆప్‌ ఇక్కడ అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. బీజేపీ మరోమారు వర్మను నిలబెట్టవచ్చని, కాంగ్రెస్‌ మహాబల్‌ మిశ్రా, దేవేందర్‌ యాదవ్‌ల పేర్లు పరిశీలిస్తోంది.

మరిన్ని వార్తలు