టీడీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలి

7 May, 2018 03:58 IST|Sakshi

వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి టీజేఆర్‌ సుధాకర్‌ బాబు 

విజయవాడ సిటీ: తమ పార్టీ నేతలపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఉపేక్షించేది లేదని, నోరు అదుపులో పెట్టుకోవాలని టీడీపీ నేత బుద్దా వెంకన్నను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి టీజేఆర్‌ సుధాకర్‌ బాబు హెచ్చరించారు. మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాలను నిలదీసిన ఎమ్మెల్యే రోజాపై బుద్దా వెంకన్న చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. విజయవాడలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలను ఎత్తిచూపితే.. తమ ఎమ్మెల్యే రోజాపై కోడిగుడ్లతో కొట్టిస్తామంటారా? అని ఆయన మండిపడ్డారు. అదే జరిగితే చంద్రబాబు ఎక్కడ పర్యటన ఉంటే అక్కడ తామూ కోడిగుడ్లతో దాడి చేస్తామని హెచ్చరించారు. బుద్దా వెంకన్న సభ్యతా సంస్కారాలతో వ్యవహరించాలని హితవుపలికారు. ప్రజల పక్షాన తాము నిలబడితే.. ఓర్వలేక టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. దాచేపల్లి ఘటనకు నిరసనగా ఎమ్మెల్యే రోజా చేసిన పోరాటంతో సీఎం చంద్రబాబు సైతం ఆ బాలికను పరామర్శించాల్సి వచ్చిందని గుర్తు చేశారు.

ప్రభుత్వాన్ని నిలదీశారని ఎమ్మెల్యే రోజాపై అసభ్యంగా మాట్లాడడం సరికాదన్నారు. బుద్దా వెంకన్న  చంద్రబాబు పాఠశాలలో చేరినప్పటి నుంచి రాజకీయ హుందాతనం లేకుండా మాట్లాడు తున్నాడని మండిపడ్డారు. మీ నాయకుడు లోకేష్‌ విదేశాల్లో మహిళలతో విచ్చలవిడిగా తిరిగిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వెల్లువెత్తాయని, ఇంట్లో పనమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించినట్టు అభియోగాలు ఉన్నాయని గుర్తు చేశారు. కాగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకష్ణ చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని సుధాకర్‌బాబు డిమాండ్‌ చేశారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

తల్లి, కొడుకు కిస్‌ చేసుకున్నా తప్పేనా?

అయోమయ స్థితిలో కోడెల కుటుంబం

పాము చచ్చాక ఇక కర్ర ఎందుకు: కృష్ణంరాజు

ప్రభుత్వ లాంఛనాలతో జైపాల్‌రెడ్డి అంత్యక్రియలు

కర్ణాటక స్పీకర్‌ సంచలన నిర్ణయం

టీపీసీసీ చీఫ్‌ రేసులో ఆ ఇద్దరు..!

కమల ప్రక్షాళన

'ఢిల్లీ నుంచి భయపెడతాం'

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైపాల్‌రెడ్డి కన్నుమూత

మర్యాదగా తప్పుకోకుంటే అవిశ్వాసమే!

కేశినేని నానికి రామకృష్ణ కౌంటర్‌

‘అది సాహసోపేతమైన నిర్ణయం’

ఆజంను క్షమించే ప్రసక్తే లేదు : రమాదేవి

జమ్మూకశ్మీర్‌పై కేంద్రం సంచలన నిర్ణయం

‘రాజకీయం’లో అందరూ దొంగలేనా!

బీజేపీకి కుమారస్వామి మద్దతు!

ఎన్నికల వరకే రాజకీయాలు: ఎమ్మెల్యే శిల్పా

ఇంటింటికీ కాంగ్రెస్‌

జమిలి ఎన్నికలు ప్రజాస్వామ్యానికే హానికరం

అవినీతి నిర్మూలనకే ‘ముందస్తు న్యాయ పరిశీలన’

ఆదర్శనీయంగా మా పాలన

ఆజం ఖాన్‌పై మండిపడ్డ మహిళా లోకం

కన్నడ పీఠంపై మళ్లీ ‘కమలం’

‘అది నిజంగా గొప్ప విషయం’

రాజగోపాల్‌ రెడ్డి, వివేక్‌ ఆలోచించాలి : రేవంత్‌

జనసేన ‘ఒకే ఒక్కడి’కి నో ఛాన్స్‌

‘మ‌ర‌ణశిక్ష విధించాలనేది మా అభిప్రాయం కాదు’

కర్ణాటక సీఎంగా యెడియూరప్ప

ఇది ఇక్కడితో ఆగిపోదు: సీఎం వైఎస్‌ జగన్‌

మాస్టర్‌ ప్లాన్‌ నివేదించండి 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సంపూ డైలాగ్‌.. వరల్డ్‌ రికార్డ్‌

బిగ్‌బాస్‌.. అందుకే హిమజ సేఫ్‌!

నిఖిల్‌ క్లారిటీ.. సాహో తరువాతే రిలీజ్‌!

బిగ్‌బాస్‌.. వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీగా తమన్నా?

ఆడియెన్స్‌ చప్పట్లు కొట్టడం బాధాకరం: చిన్మయి

ఓ బేబీ షాకిచ్చింది!