కేసీఆర్‌ ఇంట్లోనూ సోదా చేయాలి 

30 Sep, 2018 02:58 IST|Sakshi

టీజేఎస్‌ అధినేత కోదండరాం డిమాండ్‌ 

సీట్ల పంపకంపై చర్చలు ప్రారంభం కాలేదు 

రెండ్రోజుల్లో ఉమ్మడి ఎజెండా 

సాక్షి, హైదరాబాద్‌: ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇంట్లోనూ కేంద్ర దర్యాప్తు సంస్థలు సోదాలు చేయాలని తెలంగాణ జన సమితి(టీజేఎస్‌) అధ్యక్షుడు ఎం.కోదండరాం డిమాండ్‌ చేశారు. శనివారం ఇక్కడి పార్టీ కార్యాలయంలో నేతలు కె.దిలీప్‌కుమార్‌ తదితరులతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. దర్యాప్తు సంస్థలు, పోలీసులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. చాలా మందిపై ఆదాయపు పన్ను, ఎన్‌ఫోర్స్‌మెంటు డైరెక్టరేట్‌ దాడులు చేయాలని కోరారు.

తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలను అమలు చేయగలిగిన చిత్తశుద్ధి, సత్తా టీజేఎస్‌కు మాత్రమే ఉందని స్పష్టం చేశారు. అమరుల ఆకాంక్షలతో ముసాయిదా తయారు చేశామని, అమలుతీరుపై చర్చిస్తామన్నారు. అమరుల ఆశయాలు, తెలంగాణవాదుల ఆకాంక్షలు నెరవేరే విధంగా మేని ఫెస్టో తయారు చేస్తామని చెప్పా రు. మహబూబ్‌నగర్‌లో ఆదివారం టీజేఎస్‌ బహిరంగసభ నిర్వహిస్తున్నామని, ఆర్‌ఎల్‌డీ అధినేత, కేంద్ర మాజీమంత్రి అజిత్‌సింగ్‌ ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారని వెల్లడించారు. ఉద్య మఆకాంక్షల సాధన ధూంధాంను సోమవారం కరీంనగర్‌లో నిర్వహిస్తున్నట్టు చెప్పారు.  

పొత్తుల ప్రక్రియ కొనసాగుతోంది... 
మహాకూటమి పొత్తుల ప్రక్రియ కొనసాగుతోందని కోదండరాం వెల్లడించారు. మొదటిదశలో మేనిఫెస్టో, కనీస ఉమ్మడి కార్యక్రమం, రెండోదశలో సీట్ల పంపకాలపై చర్చలు జరుగుతాయన్నారు. మరోకూటమి ఏర్పాటుపై చర్చ లు జరగలేదన్నారు. ప్రజాసంఘాల కోరిక మేరకు, చాలాముందుగానే ఎన్నికలు వచ్చినం దుకే పొత్తుల ప్రక్రియ చేపట్టాల్సి వచ్చిందని చెప్పారు. బీజేపీతో పొత్తు అని, సీట్ల పంప కంలో విబేధాలని ప్రచారం చేయడం వెనుక టీఆర్‌ఎస్‌ కుట్ర, సీఎం కార్యాలయం ఉన్నదనే అనుమానం కలుగుతోందన్నారు.  

>
మరిన్ని వార్తలు