అధినేతకు అండగా..

29 Jan, 2018 09:46 IST|Sakshi

నేడు జిల్లా వ్యాప్తంగా ‘వాక్‌ విత్‌ జగనన్న’ పాదయాత్ర

వెయ్యి కిలోమీటర్ల జగన్‌ పాదయాత్రకు సంఘీభావంగా యాత్ర  

శ్రీకాకుళం అర్బన్‌: అధినేతకు అండగా వైఎ స్సార్‌ సీపీ నాయకులు ముందడుగు వేయనున్నారు. ప్రజాక్షేత్రంలో తమ నాయకుడు చేస్తున్న పోరాటంలో భాగస్వాములు కావడానికి సిద్ధమవుతున్నారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకోనున్న సందర్భంగా సోమవారం జిల్లా వ్యాప్తంగా పార్టీ నాయకులు ‘వాక్‌ విత్‌ జగనన్న’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇప్పటికే జగన్‌మోహన్‌ రెడ్డి టీడీపీ నిరంకుశ విధానాలను, ప్రభుత్వ అవినీతి కార్యక్రమాలను ప్రజల కు పూస గుచ్చినట్లు వివరిస్తున్నారు. పథకాల పేరుతో జరుగుతున్న అవినీతిని, హామీలిచ్చి మర్చిపోయిన విధానాన్ని జనాలకు గుర్తు చేస్తున్నారు. జగన్‌మోహన్‌ రెడ్డి గత ఏడాది నవంబరు 6వ తేదీన వైఎస్సార్‌ కడప జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రజాసంకల్ప పాదయాత్ర ప్రారంభించి కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పూర్తి చేసుకుని నెల్లూరు జిల్లాలోకి అడుగుపెట్టారు. వెంకటగిరి వద్ద యాత్ర 1000 కిలోమీటర్లు పూర్తి చేసుకుంటోంది. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్ప పాదయాత్రకు మద్దతుగా వాక్‌ విత్‌ జగనన్న కార్యక్రమం నిర్వహించనున్నారు.

శ్రీకాకుళం నియోజకవర్గంలో..
శ్రీకాకుళం నియోజకవర్గంలో పార్టీ రీజనల్‌ కో–ఆర్డినేటర్‌ ధర్మా న ప్రసాదరావు ఆధ్వర్యంలో శ్రీకాకుళంలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌ నుంచి డే అండ్‌ నైట్‌ కూడలి వరకూ అక్కడ నుంచి పాలకొండ రోడ్‌ మీదుగా వైఎస్సార్‌ కూడలి వరకూ అక్కడ నుంచి కళింగ రోడ్‌ మీదుగా పాతబస్టాండ్‌ వరకూ ఈ పాదయాత్ర జరగనుంది. ఆమదాలవలస నియోజకవర్గంలో పార్టీ శ్రీకాకుళం పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతారాం ఆధ్వర్యంలో టీఎస్‌ఆర్‌ జూ నియర్‌ కళాశాల నుంచి కృష్ణాపురం జంక్షన్‌ వరకు ఈ పాదయాత్ర జరగనుంది. నరసన్నపేట నియోజకవర్గంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ధర్మాన కృష్ణదాస్‌ ఆధ్వర్యంలో నరసన్నపేటలోని పార్టీ కార్యాలయం నుంచి సబ్‌ రిజి స్ట్రార్‌ కార్యాలయం మీదుగా సంతపేట, వజ్రంపేట, ఆదివరపుపేట, బజారు, పెద్దపేట, ఆర్టీసీ కాంప్లెక్స్, కొత్తబస్టాండ్‌ మీదుగా ఈ పాదయాత్ర కొనసాగనుంది. టెక్కలి నియోజకవర్గం పార్టీ కన్వీనర్‌ పేడాడ తిలక్‌ ఆధ్వర్యంలో టెక్కలిలోని వైఎస్సార్‌ సీపీ కార్యాలయం నుంచి మెయిన్‌ రోడ్‌ మీదుగా వైఎస్సార్‌ జంక్షన్‌ వద్ద రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులు అర్పించి అనంతరం  పాత జాతీయ రహదారి మీదుగా ఎన్‌ఎం రోడ్‌ జంక్షన్, మెయిన్‌రోడ్, అంబేడ్కర్‌ జంక్షన్, గోపీనాథపురం, తిరుగుప్రయాణం కచేరివీధి మీదుగా వాక్‌ విత్‌ జగనన్న పాదయాత్ర జరగనుంది.

ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఆ నియోజకవర్గ సమన్వయకర్త గొర్లె కిరణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో రణస్థలం మండల కేంద్రంలోని రా మతీర్థాలు కూడలి నుంచి గిరివానిపాలెం గ్రామం వరకు సు మారు 8 కిలోమీటర్లు మేర వాక్‌ విత్‌ జగనన్న పేరిట పాదయాత్ర నిర్వహించనున్నారు. లావేరు మండలంలో పార్టీ మండల కన్వీ నర్‌ దన్నాన రాజినాయుడు ఆధ్వర్యలో సుభద్రాపురం కూడలి నుంచి వెంకటాపురం గ్రామం వరకు, ఎచ్చెర్ల మండలంలో పార్టీ మండల కన్వీనర్‌ సనపల నారాయణరావు ఆధ్వర్యంలో ఎచ్చెర్ల గ్రామం నుంచి కుశాలపురం బైపాస్‌ వరకు, జి. సిగడాం మండలంలో పార్టీ మండల కన్వీనర్‌ మీసాల వెంకటరమణ ఆధ్వర్యంలో జి. సిగడాం మండల కేంద్రం నుంచి కొత్తపేట గ్రామం వరకు పాదయాత్ర నిర్వహించనున్నారు.

పాలకొండ నియోజకవర్గ కేంద్రం పాలకొండలో నియోజకవర్గ పార్టీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి ఆధ్వర్యంలో వాక్‌ విత్‌ జగనన్న పాదయాత్ర జరుగుతుంది. యాలాం కూడలి వద్ద అం బేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి ఆర్టీసీ కాంప్లెక్స్‌ మీదుగా పలు వార్డులను కలుపుకొంటూ వీరఘట్టం రహదారిలో వైఎ స్సార్‌ విగ్రహం వద్ద సంఘీభావ పాదయాత్ర ముగుస్తుంది. రా జాం  నియోజకవర్గంలో పార్టీ ఎమ్మెల్యే కంబాల జోగులు ఆధ్వర్యంలో రాజాం పట్టణంలోని అంబేడ్కర్‌ జంక్షన్‌ నుంచి వస్త్రపురి కాలనీ వరకు వాక్‌ విత్‌ జగనన్న కార్యక్రమం పేరిట పాదయాత్ర నిర్వహించనున్నారు.

పాతపట్నం నియోజకవర్గంలో నియోజకవర్గ సమన్వయకర్త, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి శాంతి ఆ ధ్వర్యంలో వాక్‌ విత్‌ జగనన్న కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. పాతపట్నం, మెళియాపుట్టి, హిరమండలం, ఎల్‌. ఎన్‌.పేట, కొత్తూరు తదితర మండలాలలో ఆయా మండల కన్వీనర్లు ఆధ్వర్యంలో వాక్‌ విత్‌ జగనన్న కార్యక్రమం చేపడతారు. పలాస పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త సీదిరి అప్పలరాజు ఆధ్వర్యంలో మందస మండలం హరిపురం గ్రామం నుంచి మందస వరకు, వజ్రపు కొత్తూరు మండలంలో వజ్రపుకొ త్తూరు నుంచి పల్లెసారథి వరకు, పలాస మండలంలో తర్లాకోట నుంచి రెంటికోట వరకు, కాశీబుగ్గలో మూడురోడ్లు నుంచి మొగి లిపాడు వరకు పాదయాత్రను నిర్వహించనున్నారు. ఇచ్ఛాపురం నియోజకవర్గంలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త నర్తు రా మారావు ఆధ్వర్యంలో వాక్‌ విత్‌ జగనన్న పాదయాత్రను నిర్వహించనున్నారు. కవిటి మండలంలో జగతి గ్రామం కూడలి నుంచి వైఎస్సార్‌ విగ్రహం వరకు,  ఇచ్చాపురం మున్సిపాలిటీలో అ మ్మవారి ఆలయం నుంచి టూరిజరం పార్కు వద్ద వైఎస్సార్‌ విగ్రహం వరకూ, కంచిలి మండలంలో బైరిపురం నుంచి బైరిపురం కూడలి రాధాకృష్ణ ఆలయం వరకూ పాదయాత్ర జరగనుంది.

మరిన్ని వార్తలు