‘కనీసం 16 రూపాయలు కూడా ఇవ్వలేదు’

13 Sep, 2019 19:42 IST|Sakshi

టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కక్ష పూరిత రాజకీయాలు..మొత్తం రాజకీయ వ్యవస్థనే నాశనం చేస్తున్నాయని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మోదీ, కేసీఆర్ ప్రభుత్వాలు వైఫల్యం చెందుతాయని ఊహించలేదన్నారు. మన్మోహన్ సింగ్ చెప్పినట్టు ఉన్న ఉద్యోగాలు కూడా పోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కు, వార్షిక బడ్జెట్ కు  6 నెలలలో  36 వేల కోట్ల బడ్జెట్ తగ్గిందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు బడ్జెట్‌లో కేటాయింపులు తగ్గించారని మండిపడ్డారు. ఎన్నికల హామీలు అమలు చేయడంలో సీఎం కేసీఆర్  విఫలమయ్యారని విమర్శించారు. రైతు బంధు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. రైతులను కేసీఆర్ మోసం చేస్తున్నారన్నారు.

16 రూపాయలు కూడా ఇవ్వలేదు..
లక్ష రూపాయల రుణమాఫీ ఏమైందో.. కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు. యువత ఓట్ల కోసం నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పిన కేసీఆర్‌.. కనీసం 16 రూపాయలు కూడా ఇవ్వలేదని ధ్వజమెత్తారు. మహారాష్ట్ర్రలో మరాఠాలకు 50 శాతం రిజర్వేషన్లు ఇచ్చినట్టు..తెలంగాణలో కూడా 50 శాతం బీసీలు ఉన్నారు కాబట్టి 50 శాతం పైగా రిజర్వేషన్లు కేటాయించాలన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో 50 శాతం సీట్లు బీసీలకు,మైనార్టీలకు ఇస్తామని స్పష్టం చేశారు.

మేధావులు కాంగ్రెస్‌లోకి చేరాలి...
తెలంగాణ సమాజాన్ని ఆదుకోవాలంటే మేధావులు కాంగ్రెస్‌లోకి చేరాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు.17న పది గంటలకు అన్ని జిల్లా కేంద్రాలలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుందన్నారు.17న జరగబోయే పీసీసీ ఎగ్జిక్యూటివ్‌ సమావేశంలో ఏఐసీసీలో జరిగిన అంశాలపై చర్చిస్తామని తెలిపారు. ఎన్నికలతో సంబంధం లేకుండా కార్యకర్తలకు శిక్షణ తరగతులు నిర్వహిస్తామని వెల్లడించారు. అక్టోబర్ 2న  గాంధీజీ 150 వ జన్మదిన వేడుకలు ఘనంగా జరపనున్నట్లు తెలిపారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసండౌన్ లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

Minister Sabitha Indra Reddy Comments On Contract Employees Regularization

ఏసీ బస్సుకన్నా మెట్రో ధర తక్కువే 

రాష్ట్ర ప్రతిపాదననే కేంద్రం అంగీకరించింది

రేవంత్‌... ఎందుకిలా?

‘యురేనియంపై టీఆర్‌ఎస్‌ రెండు నాలుకల ధోరణి’

పార్టీకి రాజీనామా.. ఎమ్మెల్యేపై అనర్హత వేటు

అందుకే హరీష్‌ రావును కలిశా: జగ్గారెడ్డి

‘కోడెల బీజేపీలోకి చేరాలని ఎందుకు అనుకున్నారు?’

రేవంత్‌పై బీజేపీ లక్ష్మణ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

కాషాయ రేపిస్ట్‌: ఆయన్ను ఎవరూ సీరియస్‌గా తీసుకోరు!

రైల్లో మంత్రి బ్యాగు చోరీ.. మోదీనే కారణం!

బెంగాల్‌లో ఆ అవసరమే లేదు!!

ప్రభుత్వం వారి జీవితాలతో చెలగాటం ఆడుతోంది

‘సగం సీట్లు ఇవ్వకుంటే కూటమి కూలుతుంది’

కోడెల ధైర్యవంతుడు.. అలాంటి నేత..

చంద్రబాబు.. వీటికి సమాధానం చెప్పు

కాంగ్రెస్‌ మునిగిపోతున్న టైటానిక్‌: రాజగోపాల్‌ 

హుజూర్‌నగరం.. గరం!

మోదీకి కుర్తా బహుకరించిన దీదీ

తెలంగాణలో కుటుంబపాలన.. కేసీఆర్‌పై రాహుల్‌ ఫైర్‌!

రూ.2 లక్షల రుణమాఫీ చేసి చూపిస్తాం

కేటీఆర్ నేను సిద్ధమే.. నువ్వూ సిద్ధమా?

గవర్నర్‌ ప్రభుత్వానికి భజన చేస్తున్నాడు: వీహెచ్‌

కాంగ్రెస్‌ నేతలు భ్రమల్లో ఉన్నారు: హరీశ్‌

‘దగ్గరుండి ప్లాన్‌ చేసింది డీఎస్పీనే’

65 స్థానాల్లో ఓకే

టీఆర్‌ఎస్‌ సర్కారును ఎండగడతాం

ఆశావాహులకు రాహుల్‌ షాక్‌

టచ్‌లో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు

ఆ వర్గాలపై దాడులు పెరుగుతున్నాయ్‌: ఉత్తమ్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

గద్దలకొండ గణేశ్‌

నీ వెంటే నేనుంటా

పల్లెటూరి పిల్లలా..

రాముడు – రావణుడు?

యమ జోరు

రౌడీకి జోడీ