టీఆర్‌ఎస్‌పై ఆగ్రహంతో ఉన్నారు : ఉత్తమ్‌

15 Jul, 2018 16:52 IST|Sakshi
మాట్లాడుతున్న ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి

సాక్షి, నల్గొండ : తెలంగాణ రాష్ట్రం నుంచి టీఆర్‌ఎస్‌ పార్టీని తరిమికొట్టడానికి ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. ఆదివారం నల్గొండలో జరిగిన పార్లమెంటరీ స్థాయి సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి సలీం అహ్మద్‌, జానా రెడ్డి, కోమటి రెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్‌ పద్మావతి, దామోదర్‌ రెడ్డి, మల్లు రవి, బూడిద బిక్షమయ్య గౌడ్‌లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఉత్తమ్‌ మాట్లాడుతూ.. నల్గొండ పార్లమెంట్‌ స్థానాన్ని దేశంలోనే అత్యధిక మెజార్టీతో గెలుస్తామన్నారు. బూత్‌ లెవల్‌ నుంచే పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేయటానికి శక్తి యాప్లో రిజిస్టర్‌ చేస్తున్నామని తెలిపారు. ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని.. కాంగ్రెస్‌ శ్రేణులు సన్నద్ధంగా ఉండాలని సూచించారు. 

టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్లే 
నల్గొండ : టీఆర్‌ఎస్‌ పార్టీకి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్లేనని, ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ సీఎం కేసీఆర్‌ రహస్య మిత్రులని ఏఐసీసీ కార్యదర్శి సలీం అహ్మద్ ఆరోపించారు. ఆదివారం నల్గొండలో జరిగిన పార్లమెంటరీ స్థాయి సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘నల్గొండ జిల్లాలో 12 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాలను గెలుస్తామన్న నమ్మకం వచ్చింది.

శక్తి యాప్‌ ద్వారా కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలను సంఘటితం చేస్తాం. ప్రతి ఒక్కరూ శక్తి యాప్‌లో చేరాలి. అమలుకు నోచుకోని హామీలను ఇచ్చి కేసీఆర్‌, మోదీ అధికారంలోకి వచ్చారు. కేంద్రంలో రాహూల్‌ గాంధీ నాయకత్వంలో యూపీఏ ప్రభుత్వం వస్తుంది. మా ఎమ్మెల్యేలను రద్దు చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. బొడ్డుపల్లి శ్రీనివాస్‌ హత్య రాజకీయ హత్య’’ని అన్నారు. 

మరిన్ని వార్తలు