-

రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్నారు

27 Jan, 2018 03:18 IST|Sakshi
గాంధీభవన్‌లో జాతీయపతాకాన్ని ఎగురవేస్తున్న పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్

గణతంత్ర వేడుకల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉత్తమ్‌ ఆగ్రహం 

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మానవహక్కులను ఉల్లంఘిస్తూ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్నాయని పీసీసీ అధ్యక్షుడు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం 69వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గాంధీభవన్‌లో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పార్టీ నేతలు కె.జానారెడ్డి, షబ్బీర్‌ అలీ, మల్లు భట్టివిక్రమార్క, నర్సారెడ్డి, వి.హన్మంతరావు, పొన్నాల లక్ష్మయ్య, మధు యాష్కీ, సర్వే సత్యనారాయణ, దానం నాగేందర్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌ మాట్లాడుతూ అంబేడ్కర్‌ రచించిన రాజ్యాంగాన్ని ఇక్కడి పాలకులు అవమానపరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. 

అంబేడ్కర్‌ పేరు మీద ఉన్న ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు పేరు మార్చి కాళేశ్వరం ఎత్తిపోతల పథకంగా చేశారని విమర్శించారు. ఈ ప్రాజెక్టుకు కేవలం పేరు మార్చడం ద్వారా రూ.50 వేలకోట్ల అంచనా వ్యయాన్ని పెంచారన్నారు. దళిత, గిరిజన, మైనార్టీ వర్గాలకు ఎలాంటి రక్షణ లేకుండా పోయిందన్నారు. 2019 ఎన్నికల్లో కేంద్రంలోను, రాష్ట్రంలోను కాంగ్రెస్‌ ప్రభుత్వాలు వస్తాయన్నారు.  
 

మరిన్ని వార్తలు