కాంగ్రెస్‌ ఎన్నికల మేనిఫెస్టోలోని కీలక అంశాలు

5 Sep, 2018 17:30 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ముందస్తు ఎన్నికలకు ఇప్పటికే టీఆర్‌ఎస్‌ సిద్ధం కాగా.. కాంగ్రెస్‌ కూడా సై అంటుంది. అధికార పార్టీ కంటే ముందే మేనిఫెస్టోను తయారు చేసింది. జీవన్‌ రెడ్డి ఆధ్వర్యంలో 45మంది సీనియర్‌ నాయకులతో కలిసి మేనిఫెస్టోను రూపుదిద్దారు. బుధవారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి మేనిఫెస్టోలోని కొన్ని ముఖ్యమైన అంశాలను ప్రకటించారు. పూర్తి మేనిఫెస్టోని త్వరలోనే ప్రకటిస్తామని ఉత్తమ్‌ పేర్కొన్నారు.

ఉత్తమ్‌ ప్రకటించిన మేనిఫెస్టోలోని అంశాలు

  • ఇళ్లులేని కుటుంబాలకు రూ. 5లక్షలు
  • ఎస్సీ, ఎస్టీ దివ్యాంగులకు రూ. లక్ష అదనం
  • ఇందిరమ్మ ఇళ్లలో రూ. 2లక్షలతో అదనంగా మరో గది
  • బిల్లు రాని ఇందిరమ్మ ఇళ్లకు బిల్లులు చెల్లిస్తాం
  • ఎస్టీ, ఎస్సీ, మైనార్టీలకు 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్
  • కల్యాణ లక్ష్మీ సహా బంగారు తల్లి పథకం పునరుద్ధరణ
  • దివ్యాంగులు పెళ్లి చేసుకుంటే రూ. 2లక్షలు
  • అన్ని రకాల పెన్షన్లు రెట్టింపు
  • మిడ్‌మానేరు నిర్వాసితులకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు
  • గల్ఫ్‌ ఎన్నారైల కోసం రూ. 500 కోట్ల ఫండ్ ఏర్పాటు, చనిపోతే ఐదు లక్షల ఎక్స్‌గ్రేషియా
  • తెల్ల రేషన్‌ కార్డుదారులకు 6కిలోల సన్నబియ్యం
  • దళిత గిరిజనులకు ఉచితంగా సన్నబియ్యం
  • రేషన్‌ డీలర్లకు క్వింటాల్‌కు రూ.100 కమీషన్‌ ఇస్తాం
  • ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌
  • 7వ తరగతి నుంచి ఇంటర్‌ విద్యార్థినులకు సైకిళ్లు ఇస్తాం
  • లీటర్‌ పాలకు రూ.4 ప్రోత్సాహం
మరిన్ని వార్తలు