‘సీఎం కేసీఆర్‌ క్షమాపణ చెప్పాలి’

4 Jun, 2018 16:52 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కే యత్నం చేస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి తెలిపారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలతో ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలను ఎలా సస్పండ్‌ చేస్తారని ప్రశ్నించారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖూనీ జరుగుతోందని అర్థం చేసుకోవచ్చన్నారు. హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామన్నారు.

హైకోర్టు తీర్పుతో న్యాయం గెలిచిందన్నారు. కాంగ్రెస్ పార్టీకి న్యాయస్థానం, వ్యవస్థలపైన సంపూర్ణ విశ్వసం ఉందిని తెలిపారు. ఇప్పటికైనా స్పీకర్ న్యాయస్థానాల తీర్పులను గౌరవించి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్‌ల సభ్యత్వాలను పునరుద్ధరించాలన్నారు. తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్‌ క్షమాపణ చెప్పాలన్నారు. 


అన్యాయం జరిగింది: జైపాల్‌ రెడ్డి
ప్రభుత్వం చేసిన చర్యను హైకోర్టు కొట్టేసింది. సుప్రీంకోర్టుకు వెళ్ళరు.. హైకోర్టు తీర్పు ను అమలు చేయరు. తాను చేసింది రాజ్యాంగ విరుద్ధమని కేసీఆర్‌కు తెలుసు కాబట్టే అప్పీల్‌కు వెళ్లడం లేదు. రాజ్యాంగపరంగా అన్యాయం జరిగింది. ఇలాంటి పరిస్థితి 70 ఏళ్లలో ఎప్పుడూ జరగలేదు. ఇదంతా చూస్తుంటే తెలంగాణాలో రాజ్యాంగం ఉందా అనిపిస్తుంది.

మరిన్ని వార్తలు