కలప స్మగ్లింగ్‌లో మంత్రి నైతిక బాధ్యత వహించాలి

14 Jul, 2018 12:02 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్రత్‌ సుజాత

ఆదిలాబాద్‌టౌన్‌: ఇటీవల జరిగిన ఆక్రమ కలప వ్యవహారంలో రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న నైతిక బాధ్యత వహించాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్రత్‌ సుజాత్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఆదిలాబాద్‌ పట్టణంలోని ఆమె నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అటవీ శాఖ మంత్రి స్వంత జిల్లాలో లక్షల రూపాయల్లో కలప స్మగ్లింగ్‌ జరుగుతున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు. సంఘటన జరిగి 20 రోజులు గడుస్తున్నా నోరు విప్పకపోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించా రు.

దీని వెనుక మంత్రి హస్తం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. హరితహారం పేరిట దోచుకుంటూ టీఆర్‌ఎస్‌ నాయకులు, మరో వైపు కశ్మీర్‌ లాంటి ఆదిలాబాద్‌ జిల్లాలను ఏడారి ప్రాంతంగా మరుస్తున్నారని ఆరోపించారు. కలప స్మగ్లింగ్‌పై ప్రత్యేక కమిటీ వేసి విచారణ చేపట్టి, దోషులను శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు నగేష్, సంతోష్‌రావు, పోచ్చన్న, రఫిక్, భూమారెడ్డి, సంతోష్, రాజేశ్వర్, బాబాసాహెబ్, లింగన్న, వెంకటి, రూపేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు