వెల్లువెత్తిన అభిమానం

5 Mar, 2018 08:49 IST|Sakshi

దర్శి నియోజకవర్గంలో రెండోరోజు పాదయాత్రకు విశేష స్పందన

తాళ్లూరు మండలం మల్కాపురం ఎస్టీకాలనీ, చిలకలేరు మీదుగా సాగిన యాత్ర

భారీగా పాల్గొని జననేత జగన్‌కు నియోజకవర్గం నుంచి వీడ్కోలు పలికిన ప్రజలు

తాళ్లూరు : ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహిస్తున్న ప్రజా సంకల్ప యాత్రకు దర్శి నియోజకవర్గంలో ఆదివారం రెండోరోజు విశేష స్పందన లభించింది. తాళ్లూరు మండలం మల్కాపురం పంచాయతీ పరిధిలో రెండోరోజు జననేత జగన్‌కు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. రజానగరం మేజర్‌ వద్ద నుంచి ప్రారంభమైన యాత్ర.. మల్కాపురం పంచాయతీ పరిధిలోని ఎస్టీకాలనీ మీదుగా 3 కిలోమీటర్ల మేర నియోజకవర్గంలో సాగింది. చిలకలేరు బ్రిడ్జి మీదుగా అద్దంకి నియోజకవర్గంలోని అద్దంకి మండలంలోకి ప్రవేశించింది.

అడుగడుకునా జన నీరాజనం...
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్ప యాత్రకు దర్శి నియోజకవర్గంలో పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి బాదం మాధవరెడ్డి ఆధ్వర్యంలో అడుగడుగునా జనం నీరాజనం పలికారు. నియోజకవర్గంలో పాదయాత్ర ప్రారంభమైనప్పటి నుంచి ప్రజలు, మహిళలు, రైతులు దారిపొడవునా జగన్‌ను కలిసేందుకు ఆసక్తి కనబరిచారు. కరచాలనం చేసేందుకు, సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. మల్కాపురం కాలనీ వద్ద కో ఆప్షన్‌ మెంబర్‌ వలి ఆధ్వర్యంలో ముస్లిం మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఘనంగా స్వాగతం పలికి చేనేత సంచిని బహుమతిగా ఇచ్చారు. వెలుగువారిపాలెంలో ఎంపీటీసీ సభ్యులు కోటేశ్వరమ్మ నాగళి బహూకరించారు.

సమస్యల నివేదన...
అంగన్‌వాడీ వర్కర్లు తమకు తెలంగాణ ప్రభుత్వంలో పెంచినట్లు జీతాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఏపీ కాంట్రాక్ట్‌ అధ్యాపకులు రెగ్యులర్‌ చెయ్యాలని, ఒకేషనల్‌ పార్ట్‌ టైం లెక్చరర్లు ఉద్యోగ భద్రత కల్పించాలని, వికలాంగులు, ఎంఆర్‌పీఎస్‌ నేతలు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జగన్‌కు వినతిపత్రాలు అందజేశారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ దర్శి నియోజకవర్గ ఇన్‌చార్జి బాదం మాధవరెడ్డి దర్శి నియోజకవర్గం నుంచి అద్దంకి నియోజకవర్గంలోని యాత్ర ప్రవేశించే వరకు జననేత జగన్‌తో కలిసి నడిచారు. అనంతరం అద్దంకి నియోజకవర్గ ఇన్‌చార్జి బాచిన చెంచుగరటయ్య జగన్‌కు ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో తాళ్లూరు, దర్శి మండలాల పార్టీ అధ్యక్షులు ఇడమకంటి వేణుగోపాల్‌రెడ్డి, వెన్నపూస వెంకటరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కుమ్మిత అంజిరెడ్డి, ఎంపీపీ గోళ్లపాటి మోషే, జెడ్పీటీసీ సభ్యుడు మారం వెంకటరెడ్డి, ఐవీ రెడ్డి, వైస్‌ ఎంపీపీ రమావెంకటేశ్వరరెడ్డి, మాజీ ఎంపీపీ పోశం మధుసూదనరెడ్డి, మండల మాజీ అధ్యక్షుడు సుంకర బ్రహ్మానందరెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యులు ఎల్‌జీ వెంకటేశ్వరరెడ్డి, నాగేశ్వరరావు, సర్పంచ్‌ టీవీఆర్‌ సుబ్బారెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు ఎం.బ్రహ్మారెడ్డి, ఉప సర్పంచిలు శ్రీనివాసరావు, హనుమంతరావు, మాజీ సర్పంచిలు మేడగం శ్రీనివాసరెడ్డి, అంజిరెడ్డి, సొసైటీ మాజీ అధ్యక్షుడు రామకోటిరెడ్డి,  యూత్‌ అధ్యక్షుడు శరత్, ధర్మేంద్ర, కోటయ్య, తిరుపతయ్య, నాయకులు లింగారెడ్డి,  తిరుపతిరెడ్డి, సుబ్బారెడ్డి, ఎదురు చంద్రశేఖర్‌రెడ్డి, ఎదురు శ్రీనివాసరెడ్డి, యార్తల యలమందారెడ్డి, తూము వెంకటేశ్వరరెడ్డి, మున్నేల్లి రఘనాథరెడ్డి, లోకిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, సయ్యద్‌ మహ్మద్‌జాని పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు