త్రిపురలో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్‌

18 Feb, 2018 08:14 IST|Sakshi
పోలింగ్‌ కేంద్రం వద్ద క్యూలో నిల్చున్న ప్రజలు

సాక్షి, న్యూఢిల్లీ : త్రిపుర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైపోయింది. ఉదయం 7గంటలకే పోలింగ్‌ ప్రారంభం కాగా.. ప్రజలు పెద్ద ఎత్తున్న పోలింగ్‌ కేంద్రాలకు క్యూ కడుతున్నారు. మొత్తం 60 స్థానాలు ఉండగా.. నేడు 59 స్థానాలకు మాత్రమే ఉన్నిక జరగనుంది. మిగిలిన ఒక స్థానానికి తర్వాత ఎన్నిక నిర్వహించనున్నారు. చారిలాం అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి చనిపోయిన కారణంగా మార్చి 12న పోలింగ్‌ నిర్వహిస్తారు. 

ఇక ఇంత కాలం సీపీఎం ఇలాకాగా ఉన్న రాష్ట్రంలో బీజేపీ గట్టి పట్టుసాధించాలని చూస్తోంది. మొత్తం 3214 పోలింగ్‌ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేయగా.. 307 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. సీపీఎం 57 స్థానాలకు పోటీచేస్తుండగా ఇతర వామపక్ష పార్టీలైన ఆర్‌ఎస్పీ, ఫార్వర్డ్‌బ్లాక్, సీపీఐలు ఒక్కోస్థానం నుంచి పోటీలో నిలిచాయి. 

బీజేపీ మొత్తం 51 స్థానాల్లో పోటీచేస్తుండగా దాని భాగస్వామ్య పక్షమైన ఐపీఎఫ్టీ తొమ్మిది స్థానాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నది. ఒంటరిగా వెళ్తున్న కాంగ్రెస్ మొత్తం 59 స్థానాలకు పోటీచేస్తుండగా.. గోమతి జిల్లాలోని కాక్రాబన్ అసెంబ్లీ స్థానంలో అభ్యర్థిని నిలుపలేదు. మార్చి 03వ తేదీన ఫలితాలను ఎన్నికల సంఘం ప్రకటించనుంది.

మరిన్ని వార్తలు