టీఆర్‌ఎస్‌ 3, కాంగ్రెస్‌ ఒకటి

12 Mar, 2018 17:52 IST|Sakshi
టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు

రాజ్యసభకు నామినేషన్లు దాఖలు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో రాజ్యసభ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. మూడు స్థానాలకు నలుగురు అభ్యర్థులు పోటీ పడుతుండటంతో ఎన్నిక అనివార్యమైంది. టీఆర్‌ఎస్‌ నుంచి జోగినపల్లి సంతోష్‌కుమార్‌, బడుగుల లింగయ్య యాదవ్‌, బండ ప్రకాశ్‌ సోమవారం నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్‌ అభ్యర్థిగా బలరాం నాయక్‌ బరిలోకి దిగారు. ఎన్నిక అనివార్యం కావడంతో ఈ నెల 23న పోలింగ్‌ జరగనుంది. అదే రోజు కౌంటింగ్‌ ఉంటుంది.

తెలంగాణ శాసనసభలో ప్రస్తుతమున్న ఎమ్మెల్యేల బలాల ప్రకారం మూడు స్థానాలను టీఆర్‌ఎస్‌ గెలుచుకునే అవకాశముంది. అయితే ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్‌ తమ పార్టీ తరపున అభ్యర్థిని పోటీకి నిలిపింది. ఓపెన్ బ్యాలెట్‌ విధానంలో పోలింగ్‌ జరుగుతుంది కాబట్టి విప్‌ జారీ చేసి ఫిరాయింపు ఎమ్మెల్యేలను చిక్కుల్లో పడేయాలన్న వ్యూహంతో కాంగ్రెస్‌ పావులు కదుపుతోంది. మరోవైపు టీడీపీ ఎవరికి మద్దతు ఇస్తుందనేది ఇంకా ప్రకటించలేదు. ఏడుగురు ఎమ్మెల్యేల బలమున్న మజ్లిస్‌.. టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తామని తెలిపింది.

మరిన్ని వార్తలు