నిరుద్యోగ సమస్య పరిష్కారంలో టీఆర్‌ఎస్‌ విఫలం

7 Jun, 2018 13:56 IST|Sakshi
మాట్లాడుతున్న మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి 

అర్వపల్లి (తుంగతుర్తి) : నిరుద్యోగ సమస్య పరి ష్కారంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ విఫలమైందని తెలంగాణ యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు మందడి అనిల్‌కుమార్‌యాదవ్, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తంరెడ్డి అన్నారు. లక్ష ఉద్యోగాల భర్తీకై రాష్ట్ర యువజన కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో చేపట్టిన నిరుద్యోగ చైతన్య యాత్ర బుధవారం అర్వపల్లికి చే రింది.

ఈసందర్భంగా వారు మాట్లాడుతూ రా ష్ట్రంలో నిరుద్యోగులకు లక్ష ఉద్యోగాలు కాదు కదా వందల ఉద్యోగాలు కూడా రాలేదన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వలేదని విమర్శించారు. కేవలం కేసీఆర్‌ కుటుంబంలో తప్ప ఎవ్వరికి ఉద్యోగాలు రాలేదన్నారు. నిరుద్యోగులు ఎ లాంటి ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని విమర్శించారు.

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే నిరుద్యోగ సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. నిరుద్యోగ భృతి కూడా చెల్లిస్తామని వారు తెలిపారు. ఈ సందర్భంగా అర్వపల్లి మండల కేంద్రంలో వేలాది మందితో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ర్యాలీ తుంగతుర్తికి వెళ్లింది.

కార్యక్రమంలో కాంగ్రెస్‌ జిల్లా నాయకుడు చెవిటి వెంకన్నయాదవ్, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ గుడిపాటి నర్సయ్య, డాక్టర్‌ వడ్డేపల్లి రవి, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు దరూరి యోగానందచారి, వివిధ మండలాల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు అనిరెడ్డి రాజేందర్‌రెడ్డి, టి. రాంబాబు, అన్నెబోయిన సుధాకర్, ఆకుల బుచ్చిబాబు, సంకేపల్లి సుధీర్‌రెడ్డి, సంకేపల్లి కొండల్‌రెడ్డి, నాయకులు నర్సింగ శ్రీనివాస్‌గౌడ్,  సోమయ్య పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు