‘సభ్యసమాజం సిగ్గుపడేలా జగ్గారెడ్డి మాట్లాడారు’

19 Jan, 2020 19:14 IST|Sakshi

సాక్షి, సంగారెడ్డి : మంత్రి హరీశ్‌రావుకు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కుసంస్కారంతో మాట్లాడుతున్నారని మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌ విమర్శించారు. సభ్యసమాజం సిగ్గుపడేలా జగ్గారెడ్డి మాట్లాడరన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సదాశివపేట మున్సిపాలిటీలలో మంత్రి హరీశ్‌రావుకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌కు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే జగ్గారెడ్డి ప్రజలు తలదించుకునే విధంగా మాట్లాడరని విమర్శించారు. సదాశివపేటలో జగ్గారెడ్డి కూతురు ప్రచారానికి వెళితే కూడా ఓటర్లు నిలదీస్తున్నారని ఎద్దేవా చేశారు. సానుభూతి కోసమే జగ్గారెడ్డి అసభ్య పదజాలాన్ని వాడుతున్నారని ఆరోపించారు. పోలీసు స్టేషన్‌కు తరలిస్తే జగ్గారెడ్డికి సింపతి వస్తుందని భ్రమపడుతున్నారన్నారు. 

తులసి వనంలో గంజాయి మొక్క జగ్గారెడ్డి
 సంగారెడ్డ ప్రజలకు తలవంపులు తెచ్చేవిధంగా ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యవహరిస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ మండిపడ్డారు. మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీశ్‌రావు వస్తున్న ఆదరణను చూసి జగ్గారెడ్డి ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. మంత్రి పట్ల జగ్గారెడ్డి వాడిన భాషకు సిగ్గుతో తలదించుకోవాలన్నారు. తులసి వనంలో గంజాయి మొక్కలా జగ్గారెడ్డి వ్యవహారం ఉందన్నారు. సంగారెడ్డి ప్రజలకు తలవంపులు తెస్తున్న జగ్గారెడ్డికి మున్సిపాలిటీ ఎన్నికల్లో గట్టి బుద్ధి చెప్పాలని కోరారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అమరావతిలో అలజడికి కుట్రలు..

'ఆయనను మంత్రి పదవి నుంచి బర్త్‌రఫ్‌ చేయండి'

బాబుకు షాక్‌.. టీడీఎల్పీ భేటీకి పలువురు డుమ్మా

చంద్రబాబు రాజకీయ ఉగ్రవాది..

నిజామాబాద్‌ ఎమ్మెల్యే నిస్సహాయుడు..

సినిమా

అయ్య బాబోయ్‌ అసలు కలెక్షన్లు ఆగట్లా..

అభిమానుల కోసం టాప్‌ ఎక్కిన బన్నీ..

దీపిక టిక్‌టాక్‌ ఛాలెంజ్‌.. నెటిజన్లు ఫైర్‌

ఆ చిత్రంలో కీర్తి స్థానంలో ప్రియమణి

రేణూ దేశాయ్ హార్ట్ టచింగ్ మెసేజ్

హీరోయిన్‌ రష్మిక హాజరు కావాల్సిందే..

-->