మంత్రి మల్లారెడ్డికి చేదు అనుభవం

28 Jun, 2019 19:57 IST|Sakshi

సాక్షి, మేడ్చల్‌ : టీఆర్ఎస్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ఆయన శుక్రవారం మేడ్చల్ జిల్లా బోడుప్పల్‌లో పార్టీ సభ్యత్వ కార్యక్రమానికి హాజరు అయ్యారు. అయితే పార్టీ నేతలు మంత్రి సమక్షంలోనే బాహా బాహీకి దిగారు. వారిని వారించినా ఫలితం లేకపోవడంతో మంత్రి కార్యక‍్రమం మధ్యలోనే వెళ్లిపోయారు. కాగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిన్న తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ సభ్వత్య నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించి... పార్టీ తొలి సభ్యత్వాన్ని అందుకున్న విషయం తెలిసిందే. తెలంగాణవ్యాప్తంగా గురువారం నుంచి పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభం అయింది.

మరిన్ని వార్తలు