ఎఫ్‌ఆర్‌వో అనితపై దాడి హేయమైన చర్య : కోమటిరెడ్డి

1 Jul, 2019 15:58 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ :  మహిళా అటవీ అధికారిణి అనితపై ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు కోనేరు కృష్ణ చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాని కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వ అధికారులు విధులు నిర్వహిస్తున్న సమయంలో టీఆర్‌ఎస్‌ నాయకులు కర్రలతో విచక్షణారహితంగా దాడులకు పాల్పడడం దారుణమన్నారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న టీఆర్‌ఎస్‌ నాయకులు ఇలా ప్రభుత్వ అధికారులపై దాడులకు పాల్పడం హేయమైన చర్యలని కోమటిరెడ్డి అన్నారు. దాడులను ఎదుర్కొవడానికి అటవీ శాఖ అధికారులకు ప్రభుత్వం ఆయుధాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఇలాంటి దాడులు తిరిగి పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

(చదవండి : మహిళా అటవీ అధికారిపై ప్రజాప్రతినిధి దాడి)

అటవీ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కుము రంభీం జిల్లా కాగజ్‌నగర్‌ మండలం సార్సాల అటవీ ప్రాం తంలో భూమిని చదును చేసి మొక్కలు నాటేందుకు వెళ్లిన ఫారెస్ట్‌ అధికారుల బృందంపై అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకుడు, సిర్పూర్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు, కుమురంభీం జిల్లా జెడ్పీ వైస్‌ చైర్మన్‌ కోనేరు కృష్ణతో పాటు ఆయన అనుచరులు యథేచ్ఛగా దాడి చేశారు. ఈ ఘటనలో మహిళా అటవీ అధికారిణి అనిత చేయి విరగడంతో పాటు పలువురు అటవీ సిబ్బందికి గాయాలయ్యాయి.

మరిన్ని వార్తలు