ఎర్రకోటపై జెండా ఎవరు ఎగరవేయాలో మేము నిర్ణయిస్తాం

23 Mar, 2019 16:56 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న హరీష్‌ రావు

సాక్షి, సంగారెడ్డి: ఎన్నికలు దగ్గర పడటంతో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ రావు ప్రచార జోరు పెంచారు. శనివారం సంగారెడ్డిలో పార్టీ నాయకులు, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఆయన సమావేశంలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ.. రానున్న 15  రోజులు కార్యకర్తలు, పార్టీ శ్రేణులు మా కోసం కష్టపడి పని చేయండి తర్వాత ఐదు ఏళ్ళు మేము మీ కోసం మేము కష్టపడి పని చేస్తామన్నారు. వచ్చే ఎంపీసీటీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి గ్రామం తిరిగి ప్రచారం చేస్తామని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థికి సంగారెడ్డి నుంచి 30 వేల మెజారిటీ ఇవ్వాలి కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

వృద్ధులకు ఈ ఏప్రిల్ నుంచి రూ. 2016  ఫించను అందిస్తామని చెప్పారు. తెలంగాణలో  ప్రస్తుతం కాంగ్రెస్ నాయకులకు పరిస్థితి అర్ధం అయింది. రోజుకొకరూ వచ్చి పార్టీలో చేరుతున్నారు. పక్క పార్టీల వాళ్ళు కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసే వాళ్ళు పార్టీలోకి వస్తున్నారు.  ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు కాంగ్రెస్ కి ఓటు వేసే పరిస్థితి లేదన్నారు. సంగారెడ్డికి మెడికల్ కాలేజ్ రావాలి అంటే ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని చెప్పారు.

బీజేపీ వాళ్ళు మన రైతు బంధు పథకాన్ని కాపీ కొట్టారు. రాష్ట్రంలో వాళ్ళ గురుంచి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. జాతీయ ప్రాజెక్టులా విషయంలో బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి మొండిచేయి చూపించిందని విమర్శించారు. రానున్నా రోజుల్లో కేంద్రంలో ఎవరు జెండా ఎగురవేయలన్నది టీఆర్ఎస్ పార్టీ నిర్ణయిస్తుందన్నారు. రానున్న రోజుల్లో అన్ని మండలాల్లో జరిగే సమావేశాల్లో ఎంపీ అభ్యర్థి, నేను పాల్గొంటాం తెలిపారు. నర్సాపూర్లో నిర్వహించే సీఎం సభకు సంగారెడ్డి నుంచి 30 వేలకు పైగా కార్యకర్తలు తరలి రావాలి కోరారు. బీజేపీని ఎదుర్కొనే  ఏకైక పార్టీ టీఆర్ఎస్ పార్టీ మాత్రమే అన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో సంగారెడ్డిలో గులాబీ జెండా ఎగురవేద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు