‘బిడ్డా! ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు’

16 Mar, 2020 11:35 IST|Sakshi
టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌ : బీజేపీ రాష్ట్ర అ‍ధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన బండి సంజయ్‌ తీరు కొత్త బిచ్చగాడు పొద్దెరుగడు అన్నట్లు ఉందని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. సంజయ్‌ చిన్నపిల్లాడిలాగా మాట్లాడుతున్నారు. మా కారుతో మీ కమలం దుమ్ము రేగుతోంది. ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలి’ అంటూ మండిపడ్డారు. సోమవారం జీవన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఏ ఎన్నికలు జరిగినా మీ పార్టీ చతికిల పడింది. కాళేశ్వరం మూడేళ్లలో పూర్తి చేశాం. ఈ మూడేళ్లలో ఒక్కరూపాయి అయినా నువ్వు తెచ్చావా? నీ జేబులో నుండి ఇచ్చావా?. నేను రెండు సార్లు గెలిచా. నువ్వు ఒక్కసారి గెలిచావు. బిడ్డా! ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు సైతం వచ్చి రాష్ట్ర పథకాలను మెచ్చుకున్నారు. ( గోల్కొండ కోటపై కాషాయ జెండా )

దేశంలోని అన్ని రాష్ట్రాల్లో మీ పార్టీకి గోరి కట్టారు.. మాకు కాదు. అవగాహన లేకుండా బండి సంజయ్ మాట్లాడారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల విషయంలో అనవసర ఆరోపణలు చేస్తున్నారు. ప్రగతి భవన్ కూల్చేస్తా అని అంటున్నాడు. మీకు ఒక్క కార్యకర్త అయినా ఉన్నాడా? పిచ్చి లేసి మాట్లాడుతున్నవా. ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నాడు. ఈ పోటుగాడు! గుండెల్లో నిద్రపోతా అంటున్నాడు. ఏళ్ల తరబడి నిద్రపోయే ఉంది మీ బీజేపీ. కాస్త ట్రైనింగ్ తీసుకుని మాట్లాడు.. లెక్కలపై నేనే వస్తా.. నీ బండితో నా కార్‌ని అందుకోలేవ’ని అన్నారు. ( టీఆర్‌ఎస్‌లో అసమ్మతి! )

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా