మధు యాష్కీపై కవిత ఫైర్‌

2 Oct, 2018 20:14 IST|Sakshi

సాక్షి, నిజమాబాద్‌ : కాంగ్రెస్‌ నేత మధు యాష్కిపై టీఆర్‌ఎస్‌ ఎంపీ కవిత నిప్పులు చెరిగారు. కేసీఆర్‌, కేటీఆర్‌లను విమర్శించే అర్హత మధుయాష్కికి లేదన్నారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మధుయాష్కి ఓడిపోయాక నిజమాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం వైపు ఒక్క సారైనా కన్నెత్తి చూశారా అని ప్రశ్నించారు. గెలిస్తే ఒకలా, ఓడిపోతే మరోలా మాట్లాడడం సరికాదన్నారు. తాను చేసిన కృషి ఏంటో నిజామాబాద్‌ ప్రజలకు తెలుసన్నారు.

నాలుగేళ్లలో రూ.500 కోట్లు నిజమాబాద్‌కి తీసుకొచ్చి దశాబ్దాల కల నెరవేర్చానని పేర్కొన్నారు. మధు​ యాష్కీ హయంలో మూడున్నర కోట్ల నిధులు ల్యాప్స్‌ అయితే 2017లో ఆ నిధులను సాధించామన్నారు.కరీంనగర్‌, నిజామాబాద్‌ రైల్వే నిధులు కూడా 10 ఏళ్లలో రూ.440 కోట్లు వస్తే తాను ఢిల్లీకి యాభైసార్లు వెళ్లీ టాప్‌ 20లో పెట్టించానని గుర్తుచేశారు. జిల్లాకి పుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమను తీసుకొచ్చామని, బాబా రామ్‌దేవ్‌ను కలిసి పసుపు ఆధారిత పరిశ్రమల కల్పనకు ఒప్పించామని తెలిపారు. ఎన్నికలు వచ్చినప్పుడే మధుయాష్కికి ప్రజలు గుర్తుకొస్తారని ఎద్దేవా చేశారు. 

మరిన్ని వార్తలు