లోక్‌సభ ఎన్నికల్లో గులాబి జెండా ఎగరవేస్తాం : నామా

23 Mar, 2019 18:17 IST|Sakshi

సాక్షి, ఖమ్మం: ఎన్నికల సమయం దగ్గర పడటంతో ఖమ్మం టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు జిల్లా కార్యకర్తలు, పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో టీఆర్‌ఎస్‌ ఖమ్మం పార్లమెంట్ ఇంచార్జ్ నూకల నరేష్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ అన్నీ ఆలోచించే నామా నాగేశ్వరరావుకు ఎంపీ టీకెట్‌ ఇచ్చారని అన్నారు. నామాకు ఖమ్మం జిల్లాతో మంచి రాజకీయ అనుబంధం ఉందని చెప్పారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఖమ్మం కోట మీద గులాబి జెండా ఎగరాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

ఖమ్మం లోక్‌సభ స్థానం టీఆర్ఎస్‌దేనని ఆయన ధీమ వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు ఖమ్మం జిల్లాకు చారిత్రక అవసరమని తెలిపారు. అనంతరం ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ.. 70 శాతం ప్రజలు టీఆర్ఎస్‌కే ఓటు వేస్తారని వివిధ సర్వేలా ద్వారా తెలుస్తోంది. ప్రత్యర్థి పార్టీలకు అందనంత భారీ మెజారిటీతో నామాను గెలిపించాలని ప్రజలను కోరారు. తెలంగాణ అభివృద్దిలో భాగం కావాలనే నా కోరిక. నామా నాగేశ్వరరావు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ ఆలోచన విధానం నన్ను బాగా ఆకర్షించిందని చెప్పారు.

గడచిన ఐదేళ్లలో  తెలంగాణ అన్ని రంగాలలో నెంబర్ వన్ గా ఉన్నది దేశంలో కూడా నాయకత్వ మార్పు అవసరమన్నారు. తెలంగాణ విధానాలనే అనేక రాష్ట్రాలు ఆచరిస్తున్నాయి. రైతులకు 24 గంటలు కరెంటు, రైతుబంధు, సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రజలకు మేలు చేస్తున్నాయి. ఖమ్మం ప్రజలు నన్ను దీవిస్తే జిల్లా భివృద్దిలో పాలుపంచుకుంటానని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ 16/16 స్థానాలు గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు