తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం చిన్నచూపు 

12 Dec, 2019 02:03 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రాష్ట్రంపై కేంద్రం చిన్నచూపు చూస్తోందని టీఆర్‌ఎస్‌ ఎంపీలు ఆరోపించారు. ఈ మేర కు  బుధవారం పార్లమెంటు ఆవర ణలోని గాంధీ విగ్ర హం వద్ద ధర్నా చేపట్టారు. నిధులను వి డుదల చేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ధర్నాలో టీఆర్‌ఎస్‌ పార్లమెంట రీ పార్టీ నేత కె.కేశవరావు, లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు, ఎంపీలు లక్ష్మీకాంతరావు, సంతోష్‌కుమార్, పసునూరి దయాకర్, బీబీ పా టిల్, మాలోతు కవిత, వెంకటేష్‌ నేత, రంజిత్‌రెడ్డి, బండ ప్రకాశ్, లింగయ్యయాదవ్, శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నారు.

తెలంగాణకు జీఎస్టీ, వివిధ పథకాల కింద రూ. 29,891 కో ట్లు, ఐజీఎస్టీ కింద రూ. 4,531 కోట్లు, వెనుకబడిన జిల్లాలకు రూ. 450 కోట్లు, గ్రామీణాభివృద్ధికి రూ. 312 కోట్లు, యూఎల్‌బీ గ్రాంట్‌ కింద రూ. 393 కోట్లు, నీతిఆయోగ్‌ సిఫార్సుల మేరకు మిషన్‌ భగీరథకు రూ. 19,204 కోట్లు, మిషన్‌ కాకతీయకు రూ.5 వేల కోట్ల నిధులు రావాల్సి ఉందని ఎంపీలు తెలిపారు.

మరిన్ని వార్తలు