కేంద్ర బడ్జెట్‌: పెదవి విరిచిన టీఆర్‌ఎస్‌ ఎంపీలు!

1 Feb, 2018 16:39 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర బ‌డ్జెట్‌పై మరింత స్పష్టత రావాల్సి ఉందని, ఏ రాష్ట్రానికి, ఏ ప్రాంతానికి ఎన్ని నిధులు కేటాయించారో కేంద్ర ఆర్థికమంత్రి జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో స్పష్టత లేదని టీఆర్‌ఎస్‌ ఎంపీలు అభిప్రాయపడ్డారు. ఎన్నికల సమయం కావడంతో ఆకర్షణీయమైన బడ్జెట్‌ను ప్రవేశపెట్టారని, కానీ కొన్ని విషయాలను బడ్జెట్‌లో విస్మరించారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ అవసరాలను కేంద్రం దృష్టికి తీసుకెళుతామని, రాష్ట్రానికి తగిన నిధులు కేంద్రం కేటాయింస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. పార్లమెంటులో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన అనంతరం టీఆర్‌ఎస్‌ ఎంపీలు జితేందర్‌రెడ్డి, విశ్వేశ్వర్‌రెడ్డిలు మీడియాతో మాట్లాడారు. వారు ఏమన్నారంటే..

  • రాష్ట్రాల వారీగా కాకుండా మంత్రిత్వ శాఖ‌ల‌ వారీగా బ‌డ్జెట్ కేటాయింపులు జరిపారు
  • గ‌త సంవ‌త్సరం నుంచి ఈ కొత్త విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అవ‌లంబిస్తోంది
  • ఇంటింటికి మంచినీరు, రైతుల ఆదాయం రెట్టింపు, రైల్వే, మౌలిక వ‌స‌తుల‌కు బ‌డ్జెట్ లో పెద్దపీఠ వేశారు
  • రాష్ట్రాల అవ‌స‌రాల‌ను బ‌ట్టి బ‌డ్జెట్‌ను మంత్రిత్వ శాఖ‌లు కేటాయిచనున్నారు
  • రాష్ట్ర అవ‌స‌రాల‌ను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం
  • రాష్ట్ర అభివృద్ధికి రావాల్సిన నిధుల‌ను సాధిస్తాం
  • సీఎం కేసీఆర్ లాగా బ‌డ్జెట్‌ను కేంద్రంగానీ, ఏ దేశంగానీ రూపొందించ‌లేవు
  • అన్ని వ‌ర్గాల ప్రజ‌ల క‌ష్టాలు, అవ‌స‌రాలు, ప్రజల నాడిని ప‌ట్టుకొని సీఎం రాష్ట్ర బ‌డ్జెట్‌ను రూపొందిస్తున్నారు
  • మిష‌న్ భ‌గీర‌థ‌, పింఛన్లు, డ‌బుల్ బెడ్ రూం ఇళ్లు, ప్రతి వ్యక్తికి ఆరు కిలోల బియ్యం, షాదీ ముబార‌క్,
    కల్యాణలక్ష్మీ ఇలా ఎన్నో పథకాలను సీఎం కేసీఆర్ రూపొందించారు
  • బ‌డ్జెట్ ప్రసంగం విన్నా, చిన్న పిల్లాడు చ‌దివినా అర్థం అయ్యేలా రాష్ట్ర బ‌డ్జెట్ ఉంటుంది
  • కానీ కేంద్ర బడ్జెట్‌లో స్పష్టత లేదు

-  జితేంద‌ర్ రెడ్డి, టీఆర్ఎస్ ఎంపీ

ఎన్నికల సంవత్సరం కావడంతో ఆకర్షణీయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు
గ్రామీణాభివృద్ధి, రైతాంగానికి పెద్దపీఠ వేశారు
అయితే కొన్ని అంశాలను విస్మరించారు
పశుసంవర్థక శాఖకు కేవలం రూ. 11 వేల కోట్లు, హార్టికల్చర్‌కు రూ. 2 వేల కోట్లు మాత్రమే కేటాయించారు
కేంద్రం బడ్జెట్‌తో పోలిస్తే తెలంగాణ బడ్జెటే ముందుంది
గొర్రెల పెంపకానికే రాష్ట్ర ప్రభుత్వం రూ. నాలుగు వేల కోట్లు కేటాయించింది
బడ్జెట్‌లో లెక్కలు చెప్పారు కానీ, ఏ రాష్ట్రంలో ఏది నెలకొల్పబోతున్నారు, ఏం కేటాయించబోతున్నారో చెప్పలేదు
తెలంగాణపై పెట్టుబడి పెడితే, తిరిగి రాష్ట్రం దేశానికి కాంట్రిబ్యూషన్‌ ఇస్తుంది
దేశవ్యాప్తంగా తెలంగాణ నుంచి వచ్చే టాక్స్‌లు ఎక్కువ
నిరుద్యోగుల శిక్షణకు నిధులు కేటాయించడం హర్షించదగ్గ విషయం
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య పాఠశాలలు నెలకొల్పే ఆలోచనను స్వాగతిస్తున్నాం
గిరిజన బిడ్డలు అధికంగా ఉన్న తాండూరు, పరిగి లో కొత్తగా ఏకలవ్య పాఠశాలలు వస్తాయని ఆశిస్తున్నా
సొంతిళ్ల నిర్మాణం కోసం కేంద్రం నిధులు కేటాయించింది
ఈ విషయంలో డబుల్ బెడ్ రూం స్కీంతో తెలంగాణ ముందు వరుసలో ఉంది
మిషన్ భగీరథ, కాకతీయ, నీటి పారుదల ప్రాజెక్టులకు నిధులు కోరాం
కేంద్రం సైతం ఇంటింటికి మంచినీటి పథకం కోసం నిధులు కేటాయించింది
ఈ పథకంలో భాగంగా ఇంటింటికీ నీరందించే మిషన్ భగీరథకు నిధులు కేటాయిస్తారని ఆశిస్తున్నా
- కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎంపీ

మరిన్ని వార్తలు