సర్వశక్తులూ ఒడ్డుదాం!

27 Sep, 2019 02:57 IST|Sakshi

హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీఆర్‌ఎస్‌ 

60 మంది ఇన్‌చార్జిలకు మండలాలు,సామాజికవర్గాల వారీగా బాధ్యతలు 

మున్సిపల్‌ ఎన్నికల బాధ్యత లేని ఎమ్మెల్యేలు హుజూర్‌నగర్‌కు పయనం

సాక్షి, హైదరాబాద్‌: హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న టీఆర్‌ఎస్‌ ఎన్నికల వ్యూహం, ప్రచార ప్రణాళికను ఖరారు చేసింది. పార్టీ హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక ఇన్‌చార్జి పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మంత్రులు జగదీశ్‌ రెడ్డి, పువ్వాడ అజయ్‌ సమక్షంలో పార్టీ ఇన్‌చార్జిలు గురువారం తెలంగాణ భవన్‌లో సమావేశమయ్యా రు. క్షేత్ర స్థాయిలో ప్రచార వ్యూహం.. సీఎం కేసీఆర్, కేటీఆర్‌ పాల్గొనే రోడ్‌ షోలు, ప్రచార సభలపై సమావేశంలో చర్చించారు. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో ఇన్‌చార్జిలుగా వ్యవహరించే పార్టీ నేతల తో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఇటీవల సమావేశమై.. ఎన్నికల వ్యూహంపై దిశా నిర్దేశం చేశారు. ఇన్‌చార్జిల నియామకంలో కొన్ని మార్పుచేర్పులు చేయాలనే పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ సూచన మేరకు ఉప ఎన్నిక ఇన్‌చార్జిలు మరోమారు సమావేశమయ్యారు. మండలాలు, మున్సి పాలిటీల వారీగా నిర్ణయించిన ఇన్‌చార్జిల జాబితా లో గురువారం మార్పులు చేశారు. మున్సిపల్‌ ఎన్నికల బాధ్యతలు లేని మంత్రులు, ఎమ్మెల్యేలను నూతనంగా ఇన్‌చార్జిల జాబితాలో చేర్చడంతో.. ఉప ఎన్నిక ఇన్‌చార్జిల సంఖ్య 60కి చేరింది. మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలను హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక ప్రచారం, సమన్వయ బాధ్యతలకు దూరంగా ఉంచా లని తొలుత నిర్ణయించారు. సీఎం ఆదేశాల మేరకు మంత్రి సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్‌ దాస్యం వినయభాస్కర్‌తో పాటు ఎంపీ కవిత, ఎమ్మెల్యే శంకర్‌ నాయక్, రవీంద్రకుమార్‌ తదితరులను ఇన్‌చార్జిల జాబితాలో చేర్చారు.  

సామాజికవర్గాల వారీగా బాధ్యతలు.. 
హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలోని ఓటర్లను చేరువయ్యే క్రమంలో సామాజికవర్గాల వారీగా మద్దతు కూడగట్టుకోవాలని టీఆర్‌ఎస్‌ నిర్ణయించింది. నియోజకవర్గంలోని ఓ బలమైన సామాజికవర్గం ఓటర్లను దృష్టిలో పెట్టుకుని మంత్రి పువ్వాడ అజయ్, ఎమ్మెల్యేలు భాస్కర్‌రావు, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, మాగంటి గోపినాథ్‌కు బాధ్యతలు అప్పగించారు. గురువారం తెలంగాణ భవన్‌లో జరిగిన సమావేశానికి హాజరైన వీరికి.. మండలాల వారీగా బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం.   

కేసీఆర్‌ సభలు.. 
ఉప ఎన్నికల టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జిలుగా బాధ్యతలు స్వీకరించిన నేతలు.. శుక్రవారం నుంచి పూర్తి స్థాయిలో క్షేత్ర స్థాయిలో పర్యటిస్తారు. నెలాఖరులోగా పార్టీ ఇన్‌చార్జీలతో పల్లా రాజేశ్వర్‌రెడ్డి హుజూర్‌నగర్‌లో మరోమారు సమావేశమయ్యే అవకాశం ఉంది. సీఎం కేసీఆర్‌ పాల్గొనే ఎన్నికల ప్రచార బహిరంగ సభకు సంబంధించి త్వరలో తేదీ ఖరారు అవుతుందని టీఆర్‌ఎస్‌ వర్గాలు వెల్లడించాయి.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

చరిత్రను మలుపు తిప్పే ఎన్నిక

ప్లే ఆఫ్స్‌కు దబంగ్‌ ఢిల్లీ

వైఎస్సార్‌సీపీలో చేరిన టీడీపీ నేత

‘చంద్రబాబుకు అందుకే అంత ఆక్రోశం’

బీజేపీలో చేరిన యోగేశ్వర్‌, సందీప్‌

హుజూర్‌నగర్‌ బీజేపీ అభ్యర్థి ఈయనే

దేశంలో మతోన్మాదం పెరిగిపోతుంది: సీపీఐ

‘అవినీతిని ఓడిద్దాం.. గుణపాఠం చెబుదాం’

రివర్స్‌ టెండరింగ్‌తో ఆదా ఆహ్వానించదగ్గ విషయం

మన్మోహన్‌కు శుభాకాంక్షల వెల్లువ!

అది ఎన్నికల కమిషనర్‌పై కక్షేనా!?

అమిత్‌షాను కలిస్తే బీజేపీలో చేరినట్టేనా?

మీ అయ్య ఇచ్చిన పదవులతో  విర్రవీగకు!

నాగార్జునరెడ్డి.. టీడీపీ ఏజెంట్‌: ఆమంచి

రేసులో సాకే, చింతా మోహన్‌, పద్మశ్రీ!

కాంగ్రెస్‌ నేతలకు సవాల్‌ : ఈద శంకర్‌రెడ్డి

ఎన్నార్సీపై కేజ్రీవాల్‌ వ్యాఖ్యలు.. భగ్గుమన్న బీజేపీ

‘రెవెన్యూశాఖలో అవినీతి, అక్రమాలు’

‘కబ్జాదారుల చేతుల్లో ఉన్న భూములు స్వాధీనం’

దేవతల యజ్ఞాన్ని రాక్షసులు అడ్డుకున్నట్టు..

‘ఇంత దిగజారి పోయారేంటి బాబు?’

నామినేషన్లు వేసేందుకు పార్టీలు సై 

హలో సర్పంచ్... చలో హుజూర్ నగర్

'ఎంపీ అరవింద్‌ పచ్చి అబద్ధాల కోరు'

నన్ను తరిమేయడానికి ఆయన ఎవరు?

‘లాలూ’కు పట్టిన గతే కేసీఆర్‌కు పడుతుంది'

భూ ఆక్రమణదారులపై ఉక్కుపాదం

అది ముమ్మాటికీ అక్రమ కట్టడమే : ఆర్కే

టీఆర్‌ఎస్‌ గెలిస్తే ప్రజలకు లాభం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

వేణుమాధవ్‌కు కన్నీటి వీడ్కోలు

టీజర్‌ చూసి థ్రిల్‌ అయ్యాను

వైజాగ్‌ టు హైదరాబాద్‌

హ్యాపీ.. హ్యాపీ

శ్రీదేవి ఒక యాక్టింగ్‌ స్కూల్‌

తీవ్రవాదం నేపథ్యంలో...