టీఆర్‌ఎస్‌.. కాపీ కొట్టింది: కోమటిరెడ్డి

18 Oct, 2018 05:01 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాం గ్రెస్‌ మేనిఫెస్టోలోని అం శాలనే టీఆర్‌ఎస్‌ తమ మేనిఫెస్టో అంటూ కాపీ కొట్టిందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎద్దేవా చేశారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గత నాలుగేళ్లుగా నిలబెట్టుకోని కేసీఆర్‌ను ప్రజలు నమ్మరని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిరుద్యోగ భృతి సాధ్యం కాదన్న కేసీఆర్, కేటీఆర్‌లు ఇప్పు డు ఎలా ప్రకటించారని ప్రశ్నించారు. కేసీఆర్‌ ఓటమి భయంతోనే కాంగ్రెస్‌ మేనిఫెస్టోను కాపీ కొట్టారన్నారు. సీపీఎస్‌ రద్దుపై టీఆర్‌ఎస్‌ ఎందు కు స్పందించలేదని ప్రశ్నించారు. గత ఎన్ని కల్లో రూ.లక్ష రుణమాఫీని 4 దఫాలుగా చేయడంతో రైతులపై వడ్డీభారం పడిందని, మళ్లీ ఇప్పుడు రూ.లక్ష రుణమాఫీ చేస్తామం టే రైతు లు నమ్మరన్నారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్న ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుందని, తమ మేనిఫెస్టోనే ప్రజలు నమ్మి పట్టం కడతారన్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు