ఆయన నిజమైన లెజెండ్‌

7 Aug, 2018 20:42 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  ద్రవిడ అభిమానంకోసం, ద్రవిడ జాతికోసం విప్లవాత్మక పోరాటం చేసిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి అస్తమయంతో దేశం దిగ్బ్రాంతికి లోనయ్యింది.  ఆయన మృతిపై పలువురు సినీ, రాజకీయ,ఇ తర రంగాల ప్రముఖులు సంతాపం వెలుబిచ్చారు.   నటుడు , కవి, రచయిత, హేతువాది  అయిన కరుణానిధి   తమిళనాడు ముఖ‍్యమంత్రిగా, గొప్ప రాజకీయవేత్తగా   చేసిన ఎనలేని సేవలను గుర్తు చేసుకున్నారు. అటు టాలీవుడ్‌  సినీ ప్రముఖులు కూడా  కరుణానిధి మృతిపట్ల సంతాపం ప్రకటించారు.

నిజమైన లెజెండ్‌, మాస్ నాయకుడు, నిరంతరం స్పూర్తిగా నిలిచిన నాయుకుడు కరుణానిధి. ఆయనలేని లోటు పూడ్చలేనిదని టాలీవుడ్‌  ప్రముఖ నటుడు మోహన్‌ బాబు ట్వీట్‌ చేశారు.   సోదరుడు  స్టాలిన్,  అళగిరి, వారి  కుటుంబ సభ్యులకు సానుభూతి.  తన విధానాలతో లక్షలాదిమంది ప్రజలకు చేరువయ్యారు. తన రచనలతో లక్షలామంది ప్రజలకు కరుణానిధి ప్రేరణగా నిలిచారని  ట్వీట్‌ చేశారు.   ఈ సందర్భంగా  మోహన్‌బాబుఒక ఫోటోనుకూడా షేర్‌ చేశారు.

ఈ భువిని వీడిన ఆయన  నిజంగా  ఎప్పటికీ మనల్ని వీడిపోని మనిషి కరుణాధి. ఎందుకంటే  ఆయన ఎప్పటికీ మన హృదయాల్లో జీవించే వుంటారు. మన ద్వారా ఆయన బతికే వుంటారంటూ  కరుణానిధి మృతిపట్ల  తీవ్ర సంతాపాన్ని తెలిపారు మరో ప్రముఖ నటి రమ్యకృష్ణన్‌.

అన్ని అసమానతలను ఎదుర్కొన్న ధీరుడు కరుణా నిధిగారు. ఈ అంతులేని విషాదంనుంచి కోలుకునే శక్తిని ఆయన కుటుంబం, తమిళ సోదర, సోదరీ మణులకు ఆ దేవుడు  ప్రసాదించాలంటూ తెలుగు హీరో మంచు విష్ణు  ట్వీట్‌ చేశారు.  ఇంకా హీరో విశాల్‌ కూడా కరుణానిధి మృతిపట్ల ట్విటర్‌ ద్వారా  సంతాపం ప్రకటించారు.

కాగా తమిళ రాజకీయ యోధుడు, ద్రవిడ గడ్డ లెజెండరీ నేత, డీఎంకే చీఫ్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి (94) కన్నుమూశారు. నెలరోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ చెన్నై కావేరి ఆస్పత్రిలో  చికిత్స పొందుతున్న ఈ సాయంత్రం తుదిశ్వాస విడిచారు.  దీంతో అభిమానులు, డీఎంకే శ్రేణులతో పాటు ప్రపంచవ్యాప్తంగా వున్న తమిళ సోదరులు, తీవ్ర శోకంలో మునిగిపోయారు.

మరిన్ని వార్తలు