అత్యవసరంగా విచారణ చేపట్టాల్సిన అవసరం లేదు

30 Apr, 2019 16:06 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌లో సీఎల్పీని విలీనం చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. ఈ పిటషన్‌పై అత్యవసరంగా విచారణ చేపట్టాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా న్యాయస్థానం అభిప్రాయపడింది. అయితే కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హైకోర్టు పేర్కొంది. అనంతరం ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను జూన్‌ 11వ తేదీకి వాయిదా వేసింది.

విచారణ సందర్భంగా ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది జంద్యాల రవిశంకర్‌ న్యాయస్థానాన్ని కోరారు. అయితే దీనిపై అత్యవసర విచారణ అవసరం లేదని అడిషనల్‌ అడ్వొకేట్‌ జనరల్‌ రామచంద్రరావు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. కాగా, కాంగ్రెస్‌ను టీఆర్‌ఎస్‌లో విలీనం చేసేందుకు అధికార పార్టీ ప్రయత్నిస్తోందని ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఆ పార్టీ శాసనసభ పక్షనేత మల్లు భట్టివిక్రమార్క హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

చదవండి: ‘విలీనం’పై జోక్యం చేసుకోండి 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు