ఖమ్మం బంద్‌కు కాంగ్రెస్‌ సంపూర్ణ మద్దతు

13 Oct, 2019 14:35 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఆర్టీసీ డ్రైవర్‌ శ్రీనివాస్‌ రెడ్డి మృతి పట్ల సీఎల్పీ నేత భట్టి విక్రమార్క దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. శ్రీనివాస్‌ రెడ్డి మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటుందన్నారు. రేపటి ఖమ్మం జిల్లా బంద్‌కు కాంగ్రెస్‌ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ నెల 19న తలపెట్టిన తెలంగాణ బంద్‌కు కూడా కాంగ్రెస్‌ పార్టీ మద్దతు ఉంటున్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో బలిదానాలు జరగడం దారుణమన్నారు. ఉద్యోగాల కోసం రాష్ట్రం తెచ్చుకుంటే ఇప్పుడు ఆ ఉద్యోగాలనే తీసేస్తానని బెదిరించడం కేసీఆర్‌ అహంకారానికి నిదర్శనమన్నారు. ఆర్టీసీ కార్మికులను, ఉద్యోగులను సీఎం కేసీఆర్‌ కుక్క తోకతో పోల్చడం సిగ్గు చేటన్నారు. కేసీఆర్‌ నియంతలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. మఫ్టిలో వచ్చి కార్మికులపై అక్రమంగా దాడి చేసిన సీఐ రమాకాంత్‌ను వెంటనే సస్సెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. లాఠీలతో ముందుకు వస్తే.. ప్రజలు త్వరలోనే బుద్ది చెబుతారన్నారు. ఆర్టీసీ కార్మీకులకు సీఎం కేసీఆర్‌ క్షమాపణలు చెప్పి వెంటనే వారందరిని విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో తెలంగాణ ఉద్యమం మాదిరే ఆర్టీసీ ఉద్యమం కూడా ఖమ్మం నుంచే ప్రారంభిస్తామని హెచ్చరించారు. 

మరిన్ని వార్తలు