ఆర్టీసీ సమ్మె : ‘కేసీఆర్‌ వెంట మంత్రులు, ఎమ్మెల్యేలు లేరు’

30 Oct, 2019 19:34 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఆర్టీసీ కార్మికుల సకల జనుల సమరభేరిలో పాల్గొన్న ప్రొఫెసర్‌ కోదండరాం ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావుపై విమర్శలు గుప్పించారు. ఆర్టీసీ కార్మికులు జీతాలు పెంచాలని కోరడం లేదని, ఆర్టీసీని బ్రతికించండని కోరుతున్నారని వ్యాఖ్యానించారు. ఆయన మాట్లాడుతూ.. ‘అనేక సభలకు ప్రజలను హైదరాబాద్ తీసుకొచ్చిన ఆర్టీసీ కార్మికులు తమ సభకు వేరే బస్సులెక్కి హైదరాబాద్ తరలివచ్చారు. సమ్మె అత్యంత శాంతియుతంగా జరుగుతోంది. డీజిల్ రేట్లు పెరుగుతుండగా ఆర్టీసీకి లాభాలు ఎలా వస్తాయి? 

ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమైతే తప్ప బతకని పరిస్థితి ఏర్పడింది. ఇంకెంత మంది ప్రాణాలు బలి తీసుకుంటవ్. ఇప్పటికైనా కదిలిరా. మావెంట తెలంగాణ సమాజం ఉందనే వార్త మీ ఇంటికి తీసుకెళ్లండి. సమ్మె చేస్తున్నది మనం. చర్చల ఎజెండా నిర్ణయించాల్సింది మనం. ఐక్యంగా ఉండి, సంఘటితంగా పోరాడాల్సిన సమయం ఇది. కేసీఆర్ ఒంటరి వాడయ్యాడు. ఆయన వెంట మంత్రులు, ఎమ్మెల్యేలు లేరు. మిలియన్ మార్చ్ చేయడానికి వెనకాడేది లేదు’అని కోదండరాం అన్నారు. సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో జరిగిన సకల జనుల సమరభేరి సభలో ఆర్టీసీ కార్మికులు, విపక్ష పార్టీల నేతలు భారీ ఎత్తున హాజరయ్యారు. 

మరిన్ని వార్తలు