ఆర్టీసీ సమ్మె : ‘మళ్లీ వస్తామని చెప్పి..ఇప్పటికీ రాలేదు’

26 Oct, 2019 20:02 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం సాధ్యం కాదని ముందే చెప్పినట్టు ఇన్‌చార్జి ఎండీ సునీల్‌ శర్మ తెలిపారు. చర్చలు జరుగుతుండగా మళ్లీ వస్తామని చెప్పి ఆర్టీసీ జేఏసీ నేతలే వెళ్లిపోయారని అన్నారు. వారు మళ్లీ తిరిగి వచ్చినా చర్చలు జరుపుతామని స్పష్టం చేశారు. కోర్టు ఆదేశాలు ఇచ్చిన 21 అంశాలపై చర్చలకు సిద్ధమని పేర్కొన్నారు. రవాణాశాఖ కమిషనర్‌ సందీప్‌ సుల్తానియా మాట్లాడుతూ..

‘26 డిమాండ్లపై చర్చించాలని ఆర్టీసీ జేఏసీ నాయకులు అన్నారు. విలీనంపై కూడా చర్చ జరపాలని పట్టుబట్టారు. విలీనంపై చర్చ సాధ్యంకాదు అన్నాం. దాంతో సభ్యులతో చర్చించుకుని వస్తామన్నారు. ఇప్పటివరకు రాలేదు’అని చెప్పారు. కాగా, ఎర్రమంజిల్‌లోని ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం జరిగిన చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ చర్చలు అర్ధంతరంగా ముగిశాయి. కాగా, ఆర్టీసీ కార్మికుల సమ్మె నేటితో 22వ రోజుకు చేరింది.
(చదవండి : ఆర్టీసీ చర్చలు : ‘మొబైల్‌ ఫోన్లు లాక్కున్నారు’

>
మరిన్ని వార్తలు