ఫడ్నవిస్‌పై ఉద్ధవ్‌ థాక్రే ఘాటు వ్యాఖ్యలు

1 Dec, 2019 10:31 IST|Sakshi

ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ థాకరే ప్రమాణస్వీకారం సమయంలో తల్లిదండ్రుల పేర్లు చెప్పడాన్ని మాజీ సీఎం ఫడ్నవీస్ తప్పుబట్టిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ఉద్ధవ్‌ థాక్రే ఘాటుగా సమాధానం ఇచ్చారు. నా తల్లిదండ్రుల పేర్లు, మరాఠా యోధుడైన ఛత్రపతి శివాజీ పేరును ప్రమాణ స్వీకారం సమయంలో ప్రస్తావనకు తేవడం మీకు ఇష్టం లేనట్టుగా ఉంది. కానీ.. నేను వారి పేర్లను సందర్భం వచ్చిన ప్రతిసారీ నేను ప్రస్తావిస్తాను. కన్న తల్లిదండ్రుల పేర్లు చెప్పుకోలేని వారు జీవించడానికి కూడా అనర్హులన్నారు. తల్లిదండ్రుల పేర్లు చెప్పుకోవడం మహారాష్ట్రలో నేరంగా ఉన్నట్లు ఉందని ఎద్దేవా చేశారు.

కాగా.. గురువారం ఉద్ధవ్ థాక్రే చేసిన ప్రమాణ స్వీకారం నిర్దేశిత ఫార్మాట్‌లో లేదని, తండ్రి బాలాసాహెబ్ పేరును ప్రమాణ స్వీకారం సమయంలో ప్రస్తావించడం సరికాదని ఫడ్నవీస్ విమర్శించిన సంగతి తెలిసిందే. అంతకుముందు అసెంబ్లీలో సంభవించిన పరిణామాలు రాజ్యాంగ విరుద్ధమంటూ బీజేపీ సభ నుంచి వాకౌట్‌ చేసింది. ప్రొటెం స్పీకర్‌గా ఉన్న బీజేపీకి చెందిన కాళిదాస్‌ కొలాంబ్కర్‌ స్థానంలో ఎన్సీపీ నేత దిలీప్‌ వల్సే పాటిల్‌ను నియమించడంపై బీజేపీ శాసనసభాపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్‌ అభ్యంతరం తెలిపారు. ఇది రాజ్యాంగానికి విరుద్ధమని వ్యాఖ్యానించారు. 

చదవండి: విశ్వాసం పొందిన ఉద్ధవ్‌

చదవండి: డిప్యూటీ సీఎంపై వీడని ఉత్కంఠ

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

విపత్తులోనూ శవ రాజకీయాలా?

మా జీవితాలను తగ్గించొద్దు..

కరకట్ట వదిలి హైదరాబాద్‌కు పలాయనం..

ఉద్యోగులను బాబు కించపరుస్తున్నారు: సజ్జల

ముందుచూపులేని ‘లాక్‌డౌన్‌’

సినిమా

ఫిల్మ్‌ జర్నలిస్టుల కోసం అండగా...

నవ్వులతో రెచ్చిపోదాం

నాలుగు వేడుకల పెళ్లి

పని పంచుకోండి

ఎంతో నేర్చుకున్నా

జోడీ కుదిరిందా?