వడివడిగా అడుగులు.. ఠాక్రే-పవార్‌ కీలక భేటీ!

11 Nov, 2019 14:34 IST|Sakshi

ముంబై: మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ ప్రతిష్టంభనకు తెరపడే అవకాశం కనిపిస్తోంది. నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ)తో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు శివసేన రంగం సిద్ధం చేసింది. ఈ కూటమికి కాంగ్రెస్‌ పార్టీ బయటి నుంచి మద్దతు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఈ మూడు పార్టీలు కలిస్తే అలవోకగా మ్యాజిక్‌ ఫిగర్‌ను అధిగమించి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశముంది. ఈ క్రమంలో శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే, ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌తో భేటీ అయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి.. అత్యంత కీలకమైన ఈ భేటీలో పదవులు పంపకాలపై కూడా చర్చ జరిగినట్టు సమాచారం.

పదవుల పంపకాల్లో భాగంగా శివసేన ముఖ్యమంత్రి పదవిని చేపట్టనుండగా..  ఎన్సీపీకి ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌కి అసెంబ్లీ స్పీకర్‌ వంటి కీలక పదవులను సేన ఆఫర్‌ చేసినట్లు రాజకీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇక, రెండో అతిపెద్ద పార్టీగా నిలిచిన శివసేనను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ ఆహ్వానించిన సంగతి తెలిసిందే. సాయంత్రం 5గంటలకు శివసేన నేతలు గవర్నర్‌ను కలిసి.. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరనున్నారు.

ఇక, శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ కూటమి ప్రభుత్వానికి గట్టి ప్రతిపక్షంగా ముచ్చెమటు  పట్టించేందుకు సిద్ధమవుతోంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో 105 స్థానాలతో బీజేపీ అతిపెద్ద  పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే, సీఎం పదవిపై మిత్రపక్షం శివసేనతో రాజీ కుదరకపోవడంతో ప్రతిపక్షంలో ఉండేందుకు బీజేపీ సిద్ధమైంది. రెబల్‌ ఎమ్మెల్యేలను కూడా తనవైపు తిప్పుకొని.. గట్టి ప్రతిపక్షంగా సేన కూటమిని ఎదుర్కోవాలని బీజేపీ భావిస్తోంది.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఎన్సీపీకి డిప్యూటీ సీఎం, కాంగ్రెస్‌కు స్పీకర్‌..!

కేసీఆర్‌కు బ్లేడు పంపిద్దామా..

బలపడుతున్న బీజేపీ : అసదుద్దీన్‌ ఒవైసీ

‘ఆయన ఇంగ్లీషులో మాట్లాడితే ఆశ్చర్యపోవాల్సిందే’

శివసేనతో కలిస్తే.. వినాశనమే..!

అయోధ్య తీర్పు : నేషనల్‌ హెరాల్డ్‌ క్షమాపణలు

సోనియాతో మరోసారి పవార్‌ భేటీ?

అయోధ్య తీర్పు; విగ్రహావిష్కరణ వాయిదా

ఎన్డీయేకు శివసేన గుడ్‌బై..

కర్ణాటకలో ఉప ఎన్నికల నగారా

బీజేపీ వెనక్కి.. శివసేన ముందుకు

కూల్చివేతపై కేసు ఎందుకు..?: ఒవైసీ 

‘నామినేట్‌’ చేయండి.. బాస్‌ 

శివసేనకు బంపర్‌ ఆఫర్‌: గవర్నర్‌ ఆహ్వానం

జార్ఖండ్‌ ఎన్నికలకు బీజేపీ తొలి జాబితా

బీజేపీ వెనకడుగు.. సీఎం పీఠంపై శివసేన!

బీజేపీ సంచలన నిర్ణయం

అయోధ్య తీర్పు: అద్వానీకి జైలుశిక్ష తప్పదా?

కర్ణాటక ఉప ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

మహా సంకటం : గవర్నర్‌ పిలుపుపై తర్జనభర్జన

చంద్రబాబు నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది!

కమలం బల్దియా బాట 

రాజకీయాలపై ఆశ కలిగింది అప్పుడే..!

నల్లగొండలో ‘హస్తం’..నిస్తేజం!

పట్టణాల్లో పట్టుకోసం.. 

సుప్తచేతనావస్థలోకి మహారాష్ట్ర అసెంబ్లీ!

హక్కులను అణచివేస్తున్న సర్కార్‌ 

నాలుగు స్తంభాలు!

కూల్చివేత... చీల్చింది కూడా! 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మహేష్‌ బాబు కుమార్తె సితారకు లక్కీ ఛాన్స్‌

దేవిశ్రీని వెంటాడుతున్న సామజవరగమన..

తండ్రికి జాన్వీ కపూర్‌ భావోద్వేగ పోస్టు

బాక్సాఫీస్‌ దగ్గర బట్టతల ‘బాలా’ మ్యాజిక్‌

బిగ్‌బాస్‌ ట్రోఫీ, మనీ వద్దు: శ్రీముఖి

నన్ను పెళ్లి చేసుకుంటావా? నువ్వు వర్జినా?