హామీలను చంద్రబాబు ఏనాడూ నెరవేర్చలేదు: ఉమ్మారెడ్డి

27 May, 2020 11:48 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తున్న ప్రజారంజక పాలనపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తప్పుడు ప్రచారం చేస్తున్నాడని వైఎస్సార్సీపీ సీనియర్‌ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అ‍న్నారు. చంద్రబాబు నాయకత్వాన్ని ప్రజలు తిరస్కరించారన్నారని, ప్రతి విషయాన్ని రాద్దంతం చేయాలన్నదే బాబు ప్లాన్‌ అని విమర్శించారు. మేనిఫెస్టోలోని హామీలను చంద్రబాబు ఏనాడూ నెరవేర్చలేదని దుయ్యబట్టారు. మేనిఫెస్టో 65 పేజీలు మహానాడు తీర్మానాలు 60 పేజీలతో పెట్టారన్నారు. బీసీలకు 50 శాతం సీట్లు ఇస్తామని చంద్రబాబు వరంగల్ సదస్సులో చెప్పారు. కానీ 29 శాతం మాత్రమే ఇచ్చారని గుర్తు చేశారు. చంద్రబాబు చెప్పిన మాటలకు పనులకు పొంతన లేదని, పదవి దిగిపోయే ముందు చంద్రబాబు మైనార్టీ, ఎస్టీలకు మంత్రి పదవులు ఇచ్చాడని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సీఎం జగన్‌ అలా పదవులు ఇవ్వకుండా బడుగు బలహీన వర్గాలకు 60 శాతం మంత్రి పదవులు కట్టబెట్టారని, మంత్రి వర్గ విస్తరణలో బీసీలకు పెద్ద పీట వేశారని పేర్కొన్నారు. (అప్పుడు కన్నా ఎందుకు మాట్లాడలేదు)

చంద్రబాబు తన స్థాయిని దిగజార్చుకొని సీఎంపై విమర్శలు చేశారని ఉమ్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  పాలనను చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారన్నారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వంపై బురద చల్లేందుకు బాబు దుష్ప్రచారం చేస్తున్నారని, బీసీలకు 50 శాతం సీట్లు ఇస్తానన్న హామీని చంద్రబాబు ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. బీసీలకు 60 శాతం సీట్లు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి  జగన్‌ మోహన్‌రెడ్డిది అని ప్రశంసించారు. మంత్రివర్గంలో కూడా సీఎం జగన్‌ బీసీలకు చోటు కల్పించారని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన నలుగురికి డిప్యూటీ సీఎం పదవులిచ్చారని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గుర్తు చేశారు. (లొంగిపోయిన టీడీపీ నేత కూన రవికుమార్‌)

తొలి సంతకం అమలు చేయలేదు
మహానాడు పెట్టాలి కాబట్టి క్రతువుగా చంద్రబాబు పెడుతున్నాడని ఉమ్మారెడ్డి విమర్శించారు. మహానాడు వాస్తవానికి ప్రతిబింబంగా ఉండదన్నారు. ఇచ్చిన హామీలపై మేనిఫెస్టో దగ్గర పెట్టుకొని పరిశీలించమని చెప్పిన వ్యక్తి జగన్‌మోహన్‌ రెడ్డి అని కొనియాడారు. చంద్రబాబు పెట్టిన మొదటి సంతకం ‘రుణమాఫీ’ అమలు చేయలేకపోయారని, 87 కోట్లు రైతు రుణాల ఉంటే 24 వేల కోట్లకు కుదించారని దుయ్యబట్టారు. చంద్రబాబు తొలి సంతకంకు విలువ లేదని, ఆయన పాలనలో ప్రజలు ఆమోదం పొందిన పథకం ఒకటైన ఉందా అని ప్రశ్నించారు. పరిపాలన వికేంద్రీకరణ జరిగితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని సీఎం భావించారని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. ('ఎమ్మెల్యేల కాళ్లు పట్టుకునే పనిలో పడ్డాడు')

‘‘గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం కోసం సీఎం జగన్ గ్రామ, వార్డ్ సచివాలయ వ్యవస్థ తీసుకువచ్చారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో గ్రామ వార్డు, సచివాలయం వ్యవస్థ, వలంటర్లు అద్భుతంగా పని చేస్తున్నాయి. సంక్షేమాన్ని ప్రతి గడపకు సీఎం జగన్‌మోహన్ రెడ్డి తీసుకువచ్చారని, విద్య వైద్యానికి సీఎం జగన్ పెద్ద పీఠ వేశారు. పేద పిల్లల భవిష్యత్ కోసం ఇంగ్లీషు మీడియం సీఎం ప్రవేశపెట్టారు. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిది ఏర్పాటు చేశారు. దళారి వ్యవస్థను సీఎం జగన్ రూపుమాపారు. 27 లక్షల మందికి ఇళ్ల స్థలాలు సీఎం జగన్ ఇస్తున్నారు. సంక్షేమం మూల పడింది అని చంద్రబాబు అసత్య ప్రచారం చేస్తున్నారు. లాక్‌డౌన్ నిబంధనలను చంద్రబాబు పాటించలేదు. ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంలో చనిపోయిన వారికి కోటి పరిహారం సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. రాయలసీమ ప్రాజెక్టులు పై చంద్రబాబు ఎందుకు నోరు మెదపలేదు. చిన్న లిఫ్ట్ ఇరిగేషన్ పట్టుకొని కృష్ణా గోదావరి నదులు అనుసంధానం చేశానని చంద్రబాబు ప్రచారం చేసుకున్నారు. (టీటీడీపై దుష్ప్రచారం బాబు కుట్రే)

చంద్రబాబు తప్పులు చర్చించాలి
రాష్ట్ర విభజనకు మూల పురుషుడు చంద్రబాబు. రాష్ట్ర విభజనకు లేఖ ఇచ్చింది టీడీపీ. హోదాపై చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారు. ఓటుకు కోట్లు కేసులో నేను లేనని చంద్రబాబు చెప్పాలి. మహానాడును చంద్రబాబు ఇతర పార్టీలు తిట్టడానికి పెట్టొద్దు. నువ్వు ప్రజలకు ఏమి చేస్తావో మహానాడు ద్వారా చెప్పు. ఇతర పార్టీలపై బురద జల్లితే చంద్రబాబు బోర్ల పడతాడు. మహానాడులో చంద్రబాబు చేసిన తప్పులు గురించి చర్చించాలి. అయిదేళ్లలో ఏమి తప్పులు చేసారో సమీక్ష చేయాలి. ప్రభుత్వం మీద బురద జల్లలని చూస్తే అది మీ మొహం మీదనే పడుతుంది. టీడీపీ ప్రభుత్వం హయాంలో 53 నిరార్ధక ఆస్తులు అమ్మలని టీటీడీ బోర్డ్ నిర్ణయం తీసుకుంది. టీటీడీలో జరిగిన వాస్తవాలను సుబ్రహ్మణ్యం స్వామి బైట పెట్టారు. ఆస్తులు అమ్మడానికి మూల పురుషుడు చంద్రబాబే నని సుబ్రహ్మణ్యం స్వామి చెప్పారు. అని ప్రతిపక్షనేత చంద్రబాబు బాగోతాన్ని బట్టబయలు చేశారు’’.

మరిన్ని వార్తలు