మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు కేంద్ర మంత్రిమండలి ఓకే

12 Nov, 2019 15:29 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోశ్యారి సిఫార్సుకు అనుగుణంగా ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు మంగళవారం మధ్యాహ్నం జరిగిన కేంద్ర మంత్రిమండలి ఆమోద ముద్ర వేసింది ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మహారాష్ట్రలో ఏ పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమై సంఖ్యా బలం లేనందున గవర్నర్‌ సిఫార్సును పరిగణనలోకి తీసుకుని మంత్రిమండలి రాష్ట్రపతి పాలనకు ప్రతిపాదించింది. మహారాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించినా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 145 స్ధానాల మేజిక్‌ ఫిగర్‌కు చాలా దూరంలో నిలవడంతో ప్రభుత్వ ఏర్పాటుకు ఆసక్తి కనబరచలేదు.

మరోవైపు రెండో అతిపెద్ద పార్టీగా శివసేనను గవర్నర్‌ ఆహ్వానించినా బలనిరూపణకు డెడ్‌లైన్‌ పొడిగించాలన్న వినతిని గవర్నర్‌ తోసిపుచ్చారు. ఇక మూడో అతిపెద్ద పార్టీ ఎన్సీపీని మంగళవారం రాత్రి 8.30 గంటల్లోగా బలనిరూపణ చేసుకోవాలని కోరుతూ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం అందింది. ఈ దిశగా ఎన్సీపీ..కాంగ్రెస్‌, శివసేనలతో సంప్రదింపులు జరుపుతుండగానే రాష్ట్రపతి పాలనకు గవర్నర్‌ సిఫార్సు చేయడం, ఇందుకు కేంద్ర మంత్రిమండలి ఆమోద ముద్ర వేయడంపై విపక్షాలు విస్మయం వ్యక్తం చేశాయి.

మరిన్ని వార్తలు