గిరిజనులను మోసం చేసిన కేసీఆర్‌

17 May, 2018 05:30 IST|Sakshi
సభలో మాట్లాడుతున్న పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి

ప్రజాచైతన్య బస్సుయాత్రలో పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌

సాక్షి, ఆసిఫాబాద్‌: గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని సీఎం కేసీఆర్‌ మోసం చేశారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి విమర్శించారు. గిరిజనులపై సీఎం కు చిత్తశుద్ధి ఉంటే ఒక్కో కుటుంబానికి  మూడు ఎకరాల భూమి ఇవ్వా లని డిమాండ్‌ చేశారు. బుధవారం ప్రజా చైతన్య బస్సుయాత్ర సందర్భంగా కుమురం భీం జిల్లా కేంద్రం ఆసిఫాబాద్‌లో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. మద్దతు ధర అడిగిన పాపానికి ఖమ్మంలో రైతులకు బేడీలు వేశారని, భూపాలపల్లిలో పోడు భూము లు చేసుకుంటున్న గిరిజనుల్ని చెట్టు కట్టేసి కొట్టారన్నారు. ఎస్సీ, ఎస్టీల కోసం కేటాయించిన నిధుల్లో పది వేల కోట్ల రూపాయలు దారి మళ్లించినట్టు కాగ్‌ ఆక్షేపించిందని గుర్తుచేశారు. ఎన్నికల హామీల్లో ఒక్క దానిని కూడా నెరవేర్చలేదని, పైగా గిరిజనుల భూములు లాక్కుంటోం దని మండిపడ్డారు. తాము అధికారంలోకి వస్తే గిరిజనులకు ప్రత్యేక బడ్జెట్‌ కేటాయిస్తామని ఉత్తమ్‌ హామీ ఇచ్చారు.  రాష్ట్రం ఏర్పడటం లో ఆదివాసీ, సింగరేణి కార్మికుల త్యాగాలు మరువలేనివని సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి అన్నారు. సిం గరేణి వారసత్వ ఉద్యోగాలను కారు ణ్య నియామకాలుగా మార్చార న్నా రు. కాంగ్రెస్‌ ప్రారంభించిన అనేక పథకాలను టీఆర్‌ఎస్‌ ప్రభు త్వం నిలిపివేసిందని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ భట్టి విక్రమార్క అన్నారు.
 

మరిన్ని వార్తలు