తడిసిన పంటను కొనుగోలు చేయాలి

5 May, 2018 01:26 IST|Sakshi

అన్నదాతలను ఆదుకోవాలి: ఉత్తమ్‌ డిమాండ్‌

సాక్షి, హైదరాబాద్‌: వడగళ్ల వర్షాలతో తడి సిన పంటను ప్రభుత్వ మే కొనుగోలు చేయా లని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులను పరామర్శించాలని కాంగ్రెస్‌ క్యాడర్‌కు పిలుపునిచ్చారు. భారీగా కురిసిన వర్షాలతో పెద్ద ఎత్తున రైతులు నష్టపోయారని, వరితో పాటు మామిడి తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు.

రాష్ట్ర వ్యాప్తం గా దాదాపు 10 మంది రైతులు పిడుగుపాటుకు గురై మృత్యువాత పడ్డారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షాల కారణంగా లక్షలాది ఎకరాల్లో పంటలు నష్టపోవడమే కాకుండా మార్కెట్‌లోకి వచ్చిన వరి, ఇతర వ్యవసాయ ఉత్పత్తు లు తడిసిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు. ప్రభు త్వం వెంటనే గ్రామాల్లోకి అధికారులను పంపి పంట నష్టాన్ని అంచనా వేసి కేంద్ర ప్రభుత్వం తరహాలో రైతులకు నష్టపరిహారం అందేలా చూడాలన్నారు. పిడుగుపాటుతో మరణించిన రైతు కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.  

మరిన్ని వార్తలు